Best Web Hosting Provider In India 2024
Comic Con India Hyderabad: కామిక్స్, గేమింగ్, సూపర్ హీరోస్ మెర్సెండైజ్ సహా మరిన్ని ఆకర్షణీయమైన విషయాలు ఉండే కామిక్ కాన్ ఇండియా ఈవెంట్ హైదరాబాద్‌లో జరగనుంది. సుమారు మూడేళ్ల తర్వాత మళ్లీ ఈవెంట్ హైదరాబాద్‌కు వస్తోంది. జనవరి 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ కామిక్ కాన్ ఇండియా ఈవెంట్ జరగనుంది. పాస్‌ల బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఆ వివరాలివే..
ట్రెండింగ్ వార్తలు
కామిక్స్, యానిమ్, గేమింగ్, పాప్ కల్చర్ ఇష్టపడేవారికి ఈ కామిక్ కాన్ ఈవెంట్ థ్రిల్ అందిస్తుందని నిర్వాహకులు వెల్లడించారు. ప్రముఖ పబ్లిషింగ్ హౌస్‌లకు చెందిన కామిక్స్ ఈ ఈవెంట్లో ఉండనున్నాయి. ఇండువెర్స్, యాలి డ్రీమ్స్ క్రియేషన్స్, సుఫి కామిక్స్, ప్రసాద్ భట్, రాజ్ కామిక్స్, లిలోరోష్, యాసిడ్ టోడ్, గార్బేజ్ బిన్, కార్బొరేట్ కామిక్స్, బుల్స్ ఐ ప్రెస్, బాకర్మాక్స్, ఆర్ట్ ఆఫ్ సావియాకు చెందినవి సహా మరిన్ని కామిక్స్ ఈవెంట్లో ఉండనున్నాయి. చాలా మంది ఆర్టిస్ట్స్ ఈ ఈవెంట్‌కు రానున్నారు.
అమర చిత్ర కథ, రాజ్ కామిక్స్ సహా మరిన్ని ఇండియన్, ఇంటర్నేషనల్ క్రియేషన్‌లకు సంబంధించిన ప్యానల్స్, ప్రత్యేక సెషన్లు కూడా ఈవెంట్లో ఉండనున్నాయి.
బెస్ట్ ఇండియన్ కామిక్స్, కాస్ ప్లే, గేమింగ్, గీకీ షాపింగ్ సహా మరిన్ని అంశాలు ఉండే అతిపెద్ద షో ఇదేనని కామిక్ కాన్ ఇండియా ఫౌండర్ జతిన్ వర్మ తెలిపారు. మూడేళ్ల విరామం తర్వాత ఈ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని అన్నారు.
ఈ కామిక్ కాన్ ఇండియా ఈవెంట్లో గేమింగ్ కూడా భారీ రేంజ్లో ఉండనుంది. డైలీ గేమింగ్ టోర్నమెంట్లు, ఈ స్పోర్ట్స్, పాపులర్ స్ట్రీమర్స్ ఉండే గేమింగ్ ఎరీనా ఉంటుంది. స్టాండప్స్ కూడా ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు.
కామిక్ కాన్ ఇండియా తేదీలు, వేదిక
కామిక్ కాన్ ఇండియా ఈవెంట్ జనవరి 27, జనవరి 28 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. రెండు రోజులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది.
కామిక్ కాన్ ఇండియా పాస్‌ల బుకింగ్ ఇలా..
కామిక్ కాన్ ఇండియా ఈవెంట్ కోసం పాస్‌లను www.comiccon.in లేదా బుక్ మై షోలో బుక్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. పాస్ ధర రూ.899 (ఒక రోజుకు)గా ఉంది. ప్రత్యేకమైన రూ.3,299 (సూపర్ ఫ్యాన్ పాస్) పాస్ కూడా ఉంది.
అందరికీ ఇవి ఫ్రీ
ఈ ఈవెంట్‌కు హజరయ్యే ప్రతీ ఒక్కరికీ మార్వెల్ ఇన్ఫినిటీ నంబర్ 1 కామిక్ బుక్, లిమిటెడ్ ఎడిషన్ డీసీ కామిక్స్ బ్యాట్‌మ్యాన్ పోస్టర్, కామిక్ కాన్ ఇండియా బ్యాగ్‌ను ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
“మూడేళ్ల గ్యాప్ తర్వాత ఎట్టకేలకు కామిక్ కాన్ మళ్లీ హైదరాబాద్‌కు వచ్చేసింది. ఇక్కడి అభిమానుల కోసం ఈ ఈవెంట్ నిర్వహించేందుకు చాలా ఎదురుచూస్తున్నాం. ఈ సిటీలో ఇదే మా అదిపెద్ద షో. బెస్ట్ ఇండియన్ కామిక్స్, ఫ్యాన్స్ ఎక్స్పీరియన్సెస్, కాస్ప్లే, గేమింగ్, గీకీ షాపింగ్ సహా మరిన్ని ఉంటాయి” అని కామిక్ కాన్ ఇండియా వ్యవస్థాపకుడు జతిన్ వర్మ వివరించారు.
టాపిక్