YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.05-11-2022(శనివారం) ..
వైయస్సార్ చేయూత మార్ట్ ఏర్పాటుపై అవగాహన సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
మహిళా సంక్షేమం- ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి ..
నందిగామ పట్టణంలోని శాసనసభ్యుల వారి కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిని నందిగామ మండల వెలుగు సమాఖ్య సభ్యులు – ప్రాజెక్టు డైరెక్టర్ లు మర్యాదపూర్వకంగా కలిసి వైయస్సార్ చేయూత మార్ట్ ఏర్పాటుపై అవగాహన సమావేశం నిర్వహించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందిగామ మండల వెలుగు సమాఖ్య పరిధిలో సుమారు 1460 మంది సభ్యులుగా ఉన్నారని ,వారందరికీ అతి తక్కువ ధరలకే నాణ్యమైన పచారి సరుకులు అందించాలనే సదుద్దేశంతో కిరాణా స్టోర్ మాదిరిగా రూ.28 లక్షల అంచనా వ్యయంతో వైయస్సార్ చేయూత మార్ట్ ఏర్పాటుకు ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందించడం జరిగిందని , కావున మండల పరిధిలోని గ్రామాల్లో వెలుగు సమాఖ్య సభ్యులతో అవగాహన సమావేశాలు నిర్వహించి మార్ట్ ఏర్పాటు పై నిర్ణయం తీసుకోవాలని మహిళా గ్రూపు లీడర్లకు ఆయన సూచించారు , ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళల సంక్షేమం -అభివృద్ధికి పలు పథకాలు ప్రవేశపెట్టి వారికి చేయూతను అందించి మహిళా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలిపారు ..
ఈ కార్యక్రమంలో నందిగామ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ,ఏపీవో ,ప్రాజెక్టు డైరెక్టర్ , గ్రూపు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : అడవి రావులపాడు గ్రామంలో రూ.10 లక్షల అంచనా విలువతో “జల జీవన మిషన్”..
Follow us : Facebook,Twitter,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka