Actor Sivaji on OTTs: ఫ్యామిలీ ప్రేక్షకులు అలాంటి సీన్లను చూడాలనుకోరు: ఓటీటీల కంటెంట్‍పై శివాజీ కామెంట్లు

Best Web Hosting Provider In India 2024

90s Web Series – Actor Sivaji: సీనియర్ యాక్టర్ శివాజీ ప్రధాన పోషించిన ‘#90s (హ్యాష్‍ట్యాగ్‍ ‘నైంటీస్’): ఏ మిడిల్‍క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొందుతోంది. ఈటీవీ విన్‍ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‍కు రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కుతున్నాయి. 1990ల మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో యువ డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన 90s సిరీస్‍కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ తరుణంలో సక్సెస్ మీట్‍ను ఈ టీమ్ నేడు (జనవరి 19) నిర్వహించింది. ఈ మీట్‍లో నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ఫ్యామిలీ ప్రేక్షకులు థ్రిల్లర్లు, మర్డర్ సీన్లు చూడాలని అనుకోరని, వారికి కావాల్సింది ఎంటర్‌టైన్‍మెంట్ అని శివాజీ చెప్పారు. కుటుంబంలో అందరూ థ్రిల్లర్స్ లాంటివి చూడరని చెప్పారు. మన ప్రతీరోజు జీవితాల ఆధారంగా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్టోరీలు ఎక్కువగా రావడం లేదని శివాజీ చెప్పారు.

“ఇంటికి వచ్చిన తర్వాత టీవీ పెడతారు. వాళ్లకు కావాల్సింది ఏంటి అప్పుడు.. మర్డర్ చేసే సీన్లు కాదు.. థ్రిల్లర్లు కాదు.. వాళ్లకు కావాల్సింది ఎంటర్‌టైన్‍మెంట్. నాకు ఉన్న అనుభవంతో చెబుతున్నా. ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు ఈ విధంగా ఆలోచించాలి. థ్రిల్లర్స్ క్రియేట్ చేయడం పెద్ద కష్టమైన పని కాదేమో. కానీ మన లైఫ్‍ని క్రియేట్ చేయడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. దాని రీచ్ కూడా తొందరగా ఉంటుంది. ఇంట్లో కూడా అందరూ థ్రిల్లర్స్ చూడరు. చాలా ప్లాట్‍ఫామ్‍ల్లో స్టూడెంట్స్, పిల్లలు ఫోన్లలోనే చూస్తుంటారు. 10 శాతం మందే ఫ్యామిలీ వాళ్లు చూస్తారు. ఆరంభంలో కొరియన్ థ్రిల్లర్లకు బాగా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకంటే విసుగు వచ్చేసింది. దాన్ని ఇప్పుడు బ్రేక్ చేసింది హ్యాష్ ట్యాగ్ నైంటీస్” అని శివాజీ అన్నారు.

నేను రాజకీయాలకు పనికి రాను

తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకూడదని నిశ్చయించుకున్నానని శివాజీ చెప్పారు. తనను ఏ పార్టీకి అంటగట్టొదని, ఒకవేళ అలా చేస్తే ఆ పార్టీలోకి వెళ్లి అందరి దూల తీర్చేస్తానని అన్నారు. తన జోలికి రావొద్దని శివాజీ చెప్పారు. తాను నిజాలు మాత్రమే మాట్లాడతానని, అందుకే రాజకీయాలకు పనికి రాననని శివాజీ తేల్చేశారు. అయితే, ప్రజల గొంతుకగా ఉంటానని అన్నారు. తాను యాక్టింగ్‍పైనే పూర్తి దృష్టి సారిస్తానని శివాజీ స్పష్టం చేశారు.

90s సిరీస్‍కు రెండో సీజన్

ఫుల్ సక్సెస్ అయిన నైంటీస్‍కు రెండో సీజన్‍ను రూపొందించనున్నట్టు నిర్మాత నవీన్ మేడారం తెలిపారు. రెండో సీజన్ మరింత సరదాగా ఉంటుందని అన్నారు.

నైంటీస్ వెబ్ సిరీస్‍లో శివాజీతో పాటు వాసుకీ ఆనంద్, మౌళి తనూజ్ ప్రశాంత్, రోహన్, వసంతిక, స్నేహాల్ కీలకపాత్రలు పోషించారు. 1990ల్లో మధ్య తరగతి కుటుంబం పరిస్థితులే ప్రధాన కథాంశంగా ఈ సిరీస్ రూపొందింది. మధ్యతరగతి పెద్ద అయిన ఉపాధ్యాయుడిగా శివాజీ నటన ఈ సిరీస్‍లో ఆకట్టుకుంటోంది.

ఈటీవీ వన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న నైంటీస్ వెబ్ సిరీస్‍పై ప్రముఖుల నుంచి ప్రేక్షకుల వరకు చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా 1990ల జ్ఞాపకాలను గుర్తు చేసేలా, చాలా మందికి కనెక్ట్ అయ్యేలా ఈ సిరీస్ ఉంది. ఈ సిరీస్‍కు సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024