YSRCP Nandigama : పట్టణంలోని 8 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”…

YSRCP Nandigama :

ysrcp nandigama

jagan mohan rao monditoka

ysrcp mla nandigama

ysr congress party nandigama mla

 

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.07-11-2022(సోమవారం) ..

రాష్ట్రంలో ప్రజారంజక పాలన ..

పట్టణంలోని 8 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం” నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

నందిగామ పట్టణంలోని 8 వ వార్డు లో సోమవారం ఉదయం “గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు ,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతుందని , ప్రతి హామీ అమలు చేస్తూ ప్రజలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని తెలిపారు , ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడంతో పాటు ప్రజలకు పాలనా ఫలాలు అందుతున్న తీరు తెలుసుకున్నారు ,ఇంకా సమస్యలు ఉంటే పరిష్కారానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారని ప్రజలతో నాయకులు, అధికారులు మమేకం కావడమే ముఖ్య ఉద్దేశమన్నారు ,అవినీతికి తావులేని పాలతో ప్రజలకు మేలు జరుగుతుంటే ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ,ప్రభుత్వంపై బురద చల్లి ప్రయోజనం పొందాలని కూయుక్తులు పన్నుతున్నాయని -ప్రజలకు మంచి చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు ,ఎన్ని అవంతరాలు ఎదురైనా రాష్ట్ర అభివృద్ధికి -ప్రజా సంక్షేమానికి సీఎం కట్టుబడి ఉన్నట్లు చెప్పారు ..

ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్, ఏఈ, కౌన్సిల్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు ,సచివాలయ సిబ్బంది ,పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ..

YSRCP Nandigama : వైయస్సార్ చేయూత మార్ట్ ఏర్పాటుపై అవగాహన సమావేశం ….

#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *