YSRCP Nandigama : పట్టణంలోని 9 వ వార్డు లో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”…

YSRCP Nandigama :


 

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.07-11-2022(సోమవారం) ..

ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు ..

పట్టణంలోని 9 వ వార్డు లో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

నందిగామ పట్టణంలోని 9 వ వార్డులో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి – వారి జీవితాల్లో వెలుగులు నింపేలా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలన్నీ ఏకమై కుట్రలు చేస్తున్నాయని , ప్రతిపక్షాలు పన్నుతున్న కుయుక్తులను ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు ,రాష్ట్రంలో ఎన్నడు జరగని విధంగా అభివృద్ధి -సంక్షేమాన్ని సమ ప్రాధాన్యంగా పనిచేస్తూ ,అవినీతి లేని పారదర్శక పాలనతో దేశానికి ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని , కుల- మత -రాజకీయ పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తూ ప్రజల ఇళ్ళ ముంగిటకే పరిపాలన తీసుకువచ్చి -వాలంటీర్లు ,సచివాలయ సిబ్బంది పేర్లతో లక్షలాదిమందికి ఉద్యోగాలు కల్పించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ చరిత్ర సృష్టించారని తెలిపారు ,మంచి మనసున్న ముఖ్యమంత్రి కి ప్రజలంతా అండగా నిలవాలని కోరారు ..

ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ,తదితరులు పాల్గొన్నారు ..

 

YSRCP Nandigama : పట్టణంలోని 8 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”…

Follow us : Facebook,Twitter,Instagram

#ysrcp_nandigama

#mla_nandigama

#jagan_mohan_rao_monditoka

#mlc_nandigama

#arun_kumar_monditoka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *