
ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల మండలం :
ది.10-11-2022(గురువారం) ..
గండేపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
రూ.65 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణం -మౌలిక వసతుల కల్పన ..
విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాంది ..
కంచికచర్ల మండలంలోని గండేపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.65 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శాసనసభ్యులు డాక్టర్ జగన్ మోహన్ రావు గారు గురువారం శంకుస్థాపన నిర్వహించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో సమూల మార్పులకు నాంది పలికారని , నాడు -నేడు కార్యక్రమం ద్వారా రూ.వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారుస్తున్నారని తెలిపారు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు యావత్ దేశం గమనిస్తుందని , ముఖ్యంగా విద్య వైద్య రంగాలకు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు ,పాఠశాల నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించడంతోపాటు త్వరగా పూర్తిచేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు , ముఖ్యంగా పనులను అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు -ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని ఆయన సూచించారు ..
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వేల్పుల ప్రశాంతి ,ఎమ్మార్వో రాజకుమారి ,గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు ..
Follow us :Facebook,Twitter,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka