
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.10-11-2022(గురువారం) ..
నందిగామ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్యులు, వైద్య సిబ్బంది స్నేహపూర్వకంగా మెలగాలని ,ప్రజల మరియు రోగుల నుండి ఫిర్యాదులు రాకుండా సేవలందించాలని సూచించారు , వైద్యులు ఎప్పుడు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు , అదేవిధంగా ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూపరింటెండెంట్ ను ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ఆదేశించారు , ఎమర్జెన్సీ వార్డులో అవసరమైన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు ,ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలనే సదుద్దేశంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు -ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది పనిచేయాలని ,బాధ్యతల నిర్వహణ విషయంలో – రోగులకు అవసరమైన సదుపాయాల ఏర్పాట్లలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు వైద్య సిబ్బందిని కోరారు ..
ఈ కార్యక్రమంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ గుడివాడ సాంబశివరావు, సూపరిండెంట్ డాక్టర్ సీతారావమ్మ , డాక్టర్ మాధవి లత ,డాక్టర్ సుజిత ,డాక్టర్ స్నేహ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ..