YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు మండలం :
ది.14-11-2022(సోమవారం) ..
చింతలపాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంగన్వాడీలకు మహర్దశ ..
చందర్లపాడు మండలంలోని చింతలపాడు గ్రామంలో రూ.9.5 లక్షలతో చేపట్టనున్న అంగనవాడి కేంద్ర భవన నిర్మాణానికి , ప్రహరీ గోడ నిర్మాణానికి శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు సోమవారం శంకుస్థాపన నిర్వహించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారని ,ఇప్పుడు వాటిలో సౌకర్యాల కల్పన ఆధునీకరణపై దృష్టి సారించారన్నారు ,అలాగే కొత్త కేంద్రాల నిర్మాణాలు చేపట్టి ఆధునీకరణ ఉట్టిపడేలా అంగన్‌వాడీ కేంద్రాలను రూపుదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించి ,ఒకవైపు చిన్నారులకు బోధన, సమతుల్య ఆహారం పంపిణీతో పాటు గర్భిణీలకు అన్ని వసతులు ఒకేచోట లభించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు ,ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలను దశలవారీగా సొంత భవనాల్లోకి మార్చే ప్రక్రియకు వైయస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ,ప్రీ స్కూళ్లలో బోధన అత్యంత సులువుగా ఇంగ్లీష్ మీడియంలో సాగించేందుకు అవసరమైన కిట్లను ఇప్పటికే సరఫరా చేస్తున్నట్లు చెప్పారు ,మరోవైపు బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారాన్ని, పాలు, ఇతర మందులను అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అందించే దిశగా చర్యలు తీసుకుందన్నారు ,ఈ నిర్మాణంలో బోధనా సాగించేందుకు గదులతో పాటు వంట గది, టాయిలెట్లు, ఆటస్థలం ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. అన్ని ఆధునిక హంగులతో నిర్మాణం చేయనున్న భవనాలకు ప్రహరీ గోడను కూడా నిర్మించనున్నట్లు వివరించారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ,స్థానిక ప్రజాప్రతినిధులు ,పార్టీ నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు ..
Follow us :Facebook,Twitter,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka