YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / విజయవాడ :
ది.14-11-2022(సోమవారం) ..
గ్రంథాలయాలు విజ్ఞాన దేవాలయాలు ..
జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం -పౌర గ్రంధాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 55 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారితో కలిసి శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .. ముందుగా గ్రంథాలయ పితామహుడు ఎస్.ఆర్.రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనంతోనే ప్రతి ఒక్కరిలో మేధాశక్తి పెంపొందుతుందని ,పుస్తక పఠనం ద్వారానే పరిపూర్ణ వ్యక్తిత్వం అలవడుతుందని తెలిపారు , ప్రస్తుత రోజుల్లో యువత సెల్ ఫోన్ ,టీవీ, సినిమాలు ,ఇంటర్నెట్ లకు బానిసలై పెడదోవ పడుతున్నారని ,మంచి పనులకు మాత్రమే వాటిని వినియోగించుకోవాలని సూచించారు , ముఖ్యంగా విద్యార్థులు పఠన శక్తి పెంపొందించుకోవాలని చెప్పారు , గ్రంథాలయ వ్యవస్థను ఆధునికరించే క్రమంలో భాగంగా డిజిటల్ విధానాన్ని తీసుకువచ్చారని , గ్రంథాలయ వ్యవస్థ పరిరక్షణకు రాష్ట్రంలో డిజిటల్ గ్రంథాలయాలు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు , ఢిల్లీ యూనివర్సిటీలోని గ్రంథాలయంలో తాను కమిటీ మెంబర్ వ్యవహరించానని , గ్రంథాలయాల వలన విజ్ఞానంతో పాటు ప్రముఖుల జీవిత చరిత్రలను తెలుసుకోవచ్చన్నారు ..
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ,ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి , జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు మరియు పలువురు ప్రజా ప్రతినిధులు , అధికారులు పాల్గొన్నారు ..