YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.15-11-2022(మంగళవారం) ..
అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాలు ..
పట్టణంలోని 12 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం” నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని 12 వ వార్డు లో మంగళవారం ఉదయం “గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి మాత్రమే దక్కుతుందని ,ప్రభుత్వం అందించే ప్రతి రూపాయి పేదలకు అందుతుందని చెప్పారు , ఇంటింటికి తిరుగుతూ పలు సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను తీసుకున్నారు , అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా పథకాలు రూపకల్పన చేసిన గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు , సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు , ఈ ప్రభుత్వంలో ప్రతి గడపలోను సంక్షేమ పథకాలు అందుతున్న లబ్ధిదారులు ఉన్నారన్నారు , సంక్షేమం -అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు , మహిళ రక్షణకు ,సంక్షేమానికి ఏ ప్రభుత్వం తీసుకొనన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు ,మహిళలకు రక్షణగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన దిశా యాప్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరాం, ఏఈ ఫణి శ్రీనివాస్, వార్డు ఇన్చార్జి కోమటి రవికుమార్, కౌన్సిల్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు ,సచివాలయ సిబ్బంది ,పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ..