YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.16-11-2022(బుధవారం) ..
మూడేళ్లలోనే వేగవంతంగా నందిగామ పట్టణ అభివృద్ధి ..
పట్టణంలోని 12 వ వార్డులో గడపగడపకు- మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని 12 వ వార్డు పరిధిలో బుధవారం ఉదయం గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల క్యాలెండర్ ను అందజేస్తూ – ప్రభుత్వ పనితీరును వివరించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందిగామ పట్టణాన్ని గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేసి చూపుతామని , పట్టణంలోని 20 వార్డుల అభివృద్ధితో పాటు ప్రధాన రహదారులు ,మేజర్ డ్రైనేజీల నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు , ప్రజలకు మంచి చేయాలనే తలంపుతోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని ,గత ప్రభుత్వం మాదిరిగా ఒక సామాజిక వర్గానికి కొమ్ముకాకుండా ,అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేలా కృషి చేస్తున్నారని తెలిపారు ,ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో పాటు అగ్రవర్ణ మహిళలకు సైతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో లబ్ది చేకూరుస్తున్నారని గుర్తు చేశారు ,ప్రతి పట్టణం -ప్రతి గ్రామం బాగుండాలి అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆశయంతో ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు ,దీనిలో భాగంగా పట్టణాలు గ్రామాలలో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరామ్, ఏఈ ఫణి శ్రీనివాస్, ఇన్చార్జి కోమటి రవికుమార్ ,కౌన్సిల్ మరియు కో ఆప్షన్ సభ్యులు, సచివాలయ సిబ్బంది -వాలంటీర్లు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..