YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / వీరులపాడు మండలం :
ది.16-11-2022(బుధవారం) ..
రంగాపురం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
జమ్మవరం గ్రామంలో వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
వీరులపాడు మండలంలోని రంగాపురం గ్రామంలో రూ.16 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టనున్న అంగన్వాడి కేంద్ర భవన నిర్మాణానికి , జమ్మవరం గ్రామంలో రూ.17.5 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణానికి శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు బుధవారం శంకుస్థాపన నిర్వహించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజలకు అవసరమైన సేవలు అందించే విధంగా ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు ,అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారని ,ఇప్పుడు వాటిలో సౌకర్యాల కల్పన ఆధునీకరణపై దృష్టి సారించారన్నారు ,అలాగే కొత్త కేంద్రాల నిర్మాణాలు చేపట్టి ఆధునీకరణ ఉట్టిపడేలా అంగన్‌వాడీ కేంద్రాలను రూపుదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించి ,ఒకవైపు చిన్నారులకు బోధన, సమతుల్య ఆహారం పంపిణీతో పాటు గర్భిణీలకు అన్ని వసతులు ఒకేచోట లభించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు ,ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలను దశలవారీగా సొంత భవనాల్లోకి మార్చే ప్రక్రియకు వైయస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు , వైయస్సార్ హెల్త్ క్లినికల్ నిర్మాణా వలన ఆయా గ్రామాల్లోనే ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందుతుందని తెలిపారు ..
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోటేరు లక్ష్మీ ముత్తారెడ్డి , జెడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య ,షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం ,మండల కన్వీనర్ ఆవుల రమేష్ బాబు ,గ్రామ సర్పంచ్ రమావత్ కోటి , తిరుమల రావు , దాసు ,వేమిరెడ్డి సత్యనారాయణరెడ్డి ,శేషగిరిరావు , సిడిపిఓ స్పందన మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు ..