YSRCP Nandigama : పట్టణంలోని 12 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”..

YSRCP Nandigama :

 

 

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.18-11-2022(శుక్రవారం) ..

ప్రజలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు అండగా నిలవాలి ..

పట్టణంలోని 12 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

నందిగామ పట్టణంలోని 12 వ వార్డు పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల పథకాలతో పేదల జీవితాలలో వెలుగులు నిండుతున్నాయని , ఎన్నికలు -ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ముఖ్యమంత్రిగా వైస్ జగన్ అమలు చేశారన్నారు , వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులను గుర్తించి ఇళ్ల ముంగిటనే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు , వాలంటీర్ సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రజలు మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయంలో చుట్టూ తిరగకుండా గ్రామంలోని సచివాలయంలోనే 500 కు పైగా సేవలందిస్తున్నట్లు చెప్పారు , ముఖ్యంగా పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ఒక్కో సచివాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ.20 లక్షల నిధులు మంజూరు చేశారని తెలిపారు , ఆ నిధులతో గ్రామాలు -వార్డులలోని ప్రధాన సమస్యలు తెలుసుకుని ప్రాధాన్యత క్రమంలో వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు , ప్రజలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండి ఆశీర్వదించాలని కోరారు ..

ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరాం ,ఏఈ ఫణి శ్రీనివాస్ ,ఇన్చార్జి కోమటి రవికుమార్ , పట్టణ కన్వీనర్ దొంతిరెడ్డి దేవేందర్ రెడ్డి , మహమ్మద్ మస్తాన్ ,కౌన్సిల్ సభ్యులు ,కోఆప్షన్ సభ్యులు ,ఏఈ ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,సచివాలయ సిబ్బంది , వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *