YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.19-11-2022(శనివారం) ..
అర్హతే ప్రామాణికంగా ఇంటింటికి సంక్షేమం ..
పట్టణంలోని 12 వ వార్డులో గడపగడపకు- మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని 12 వ వార్డు పరిధిలో శనివారం ఉదయం గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల క్యాలెండర్ ను అందజేస్తూ – ప్రభుత్వ పనితీరును వివరించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ళ పాలనలో అర్హత ప్రామాణికంగా ఇంటింటికి సంక్షేమాన్ని అందజేశారన్నారు , గడపగడపకు- మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాలను తెలియజేయడంతో పాటు ప్రజలకు చేకూరిన లబ్ధిని వివరించారు , పింఛన్లు -అమ్మఒడి- రైతు భరోసా -జగనన్న విద్యా దీవెన ,వసతి దీవెన, ఆరోగ్యశ్రీ- ఇళ్ల పట్టాలు- సున్నా వడ్డీ రుణాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు, పేదలు ఆర్థికంగా స్థిర పడుతుంటే ప్రతిపక్ష నేత చూడలేక ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు , జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారని, గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో అక్కాచెల్లెమ్మలు -అవ్వాతాతలు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆశీస్సులు అందజేస్తూ తమను ఆదరిస్తూ ఉంటే ఎంతో సంతృప్తిగా ఉందని తెలిపారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ ,ఏఈ , కౌన్సిల్ మరియు కో ఆప్షన్ సభ్యులు, సచివాలయ సిబ్బంది -వాలంటీర్లు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..