YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.22-11-2022(మంగళవారం) ..
మహిళా అభ్యున్నతే ధ్యేయంగా వైయస్ జగన్ పాలన ..
పట్టణంలోని 12 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం” నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని 12 వ వార్డు పరిధిలోని విజయ టాకీస్ ఏరియాలో మంగళవారం ఉదయం “గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు 95% మందికి అందుతున్నాయని , 12 వ వార్డు పరిధిలో వైయస్సార్ పెన్షన్ల ద్వారా 162 మంది , వైయస్సార్ చేయూత ద్వారా 24 మంది , కాపు నేస్తం ద్వారా 3 మంది , ఈ బీసీ నేస్తం ద్వారా 28 మంది ,జగనన్న చేదోడు ద్వారా 25 మంది ,రైతు భరోసా పథకం ద్వారా 233 మంది , ఉచిత ఇళ్ల స్థలాలు 61 మందికి , అమ్మ ఒడి పథకం ద్వారా 118 మంది , జగనన్న విద్యా దీవేన పథకం ద్వారా 46 మంది లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు ,ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత గతంలో లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఇది సాధ్యమైందని చెప్పారు , పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయని , ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరింతకాలం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ ,ఏఈ , కౌన్సిల్ మరియు కో ఆప్షన్ సభ్యులు ,వార్డ్ ఇన్చార్జిలు ,పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , వాలంటీర్లు పాల్గొన్నారు ..