YSRCP Nandigama : భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 97 వ జన్మదిన వేడుకలలో పాల్గొన్న..

YSRCP Nandigama :

 

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.22-11-2022(మంగళవారం) ..

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 97 వ జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

పేదలకు దుప్పట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

నందిగామ పట్టణంలోని శ్రీ సత్య సాయి నిలయంలో భగవాన్ సత్య సాయిబాబా వారి 97 వ జన్మదిన వేడుకలను గత నాలుగు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు , మంగళవారం విద్యా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు బహుమతులను ప్రధానం చేశారు , అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని , ఎంతో భక్తి శ్రద్ధలతో – సేవాతత్పరణతో శ్రీ సత్య సాయి సేవ సమితి వారు విద్యార్థులకు ,మహిళలకు ,పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు , ఒకవైపు ఆధ్యాత్మిక భావనతో – మరో వైపు సేవాగుణంతో పలువురికి సహాయపడటం అద్వితీయమని , బాబా ఆలోచనలను- ఆశయాలను ప్రజలకు చేరవేయడంలో నందిగామ శ్రీ సత్యసాయి సేవాసమితి వారు అద్భుత రీతిలో కృషి చేస్తున్నారని కొనియాడారు .. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారిని శ్రీ సత్య సాయి సేవ సమితి వారు ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు ..

ఈ కార్యక్రమంలో నందిగామ శ్రీ సత్యసాయి సేవాసమితి కమిటీ సభ్యులు , పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *