YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.23-11-2022(బుధవారం) ..
జలకళ పథకం ద్వారా బోరు ఏర్పాటు పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
అన్నదాత సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి ..
నందిగామ మండలంలోని మునగచర్ల గ్రామంలో వైయస్సార్ జలకళ పథకంలో భాగంగా ఏర్పాటు చేయనున్న బోర్ వెల్ పనులను శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు బుధవారం ప్రారంభించారు .. ముందుగా బోరు యంత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెత్త భూములకు సైతం సాగునీటిని అందించేందుకు , బీడు భూములకు సైతం సాగునీటిని అందించి సస్యశామలం చేయాలనే తలంపుతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ రైతు భరోసా పథకంలో భాగంగా వైయస్సార్ జలకళ పథకాన్ని రూపొందించారన్నారు ఈ పథకం వల్ల ప్రభుత్వమే ఉచితంగా బోర్లు వేయిస్తుందని తెలిపారు , ఉలవచర్ల గ్రామంలో వైయస్సార్ జలకళ పథకం ద్వారా మూడు బోర్లు వేస్తున్నామని , రెండున్నర ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు పథకం వర్తిస్తుందని తెలిపారు , వైయస్సార్ జలకళ పథకాన్ని అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు , గ్రామ వాలంటీర్ల ద్వారా పాసుపుస్తకం ,ఆధార్ కార్డుతో సచివాలయంలో పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు ..
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆకుల రంగా , గ్రామ నాయకులు చిరుమామిళ్ల వెంకటేశ్వరరావు ,తాళ్లూరి భద్రయ్య, శివ నాగేశ్వరరావు ,గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,రైతులు పాల్గొన్నారు .
YSRCP Nandigama : పట్టణంలోని 7 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం” …
Follow us : Facebook,Twitter,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka