YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.23-11-2022(బుధవారం) ..
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 97 వ జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
శ్రీ సత్య సాయి నిలయానికి తన సొంత నిధులు గతంలో ప్రకటించిన రూ.5 లక్షల విరాళాన్ని అందజేసిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
సత్యసాయి ఆలయ అభివృద్ధికి తన సొంత నిధులతో మరో రూ.3 లక్షల విరాళం ప్రకటించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
నందిగామ పట్టణంలోని శ్రీ సత్య సాయి నిలయంలో భగవాన్ సత్య సాయిబాబా వారి 97 వ జన్మదిన వేడుకలను గత నాలుగు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు ,బుధవారం చివరి రోజు సందర్భంగా నిర్వహించిన జ్యోతి ప్రజ్వలన మరియు కేక్ కటింగ్ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ..
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ,శ్రీ సత్య సాయి నిలయ అభివృద్ధికి గతంలో ప్రకటించిన రూ.5 లక్షల విరాళాన్ని అందజేశానని , ఆలయ అభివృద్ధికి మరో రూ.3 లక్షలు అందజేస్తానని హామీ ఇచ్చారు ,ఎంతో భక్తి శ్రద్ధలతో – సేవాతత్పరణతో శ్రీ సత్య సాయి సేవ సమితి వారు విద్యార్థులకు ,మహిళలకు ,పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు , ఒకవైపు ఆధ్యాత్మిక భావనతో – మరో వైపు సేవాగుణంతో పలువురికి సహాయపడటం అద్వితీయమని , బాబా ఆలోచనలను- ఆశయాలను ప్రజలకు చేరవేయడంలో నందిగామ శ్రీ సత్యసాయి సేవాసమితి వారు అద్భుత రీతిలో కృషి చేస్తున్నారని కొనియాడారు .. అనంతరం ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని శ్రీ సత్య సాయి సేవ సమితి వారు ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు ..
ఈ కార్యక్రమంలో నందిగామ శ్రీ సత్యసాయి కమిటీ సభ్యులు వాసుదేవరావు , రవీంద్ర రాజు , సంగమేశ్వర రావు , బొందలపాటి నరసింహారావు తుర్లపాటి కోటేశ్వరరావు ,పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ..
Follow us : Facebook,Twitter,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandiigama
#arun_kumar_monditoka