Hyderabad City Police : ‘మీది మొత్తం వెయ్యి, ఛార్జెస్ ఎక్స్ ట్రా’- కుమారి ఆంటీ డైలాగ్ తో వాహదారుడికి సిటీ పోలీసులు ఝలక్

Best Web Hosting Provider In India 2024

Hyderabad City Police : హైదరాబాద్ సిటీ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ ఉంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ట్రెండింగ్ అంశాలతో అవగాహన కల్పిస్తూ సైబర్ నేరాలు, వాహనదారుల నిర్లక్ష్యంపై అలర్ట్ చేస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో ఇటీవల సెన్సెషన్ క్రియేట్ చేసిన డైలాగ్ “మీది మొత్తం వెయ్యి అయ్యింది. రెండు లివర్లు ఎక్స్ ట్రా”. గచ్చిబౌలిలో భోజన హోటల్ నడుపుతున్న కుమారి ఆంటీ(Kumari Aunty) డైలాగ్. ఈ ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియాను షేక్ చేశారు కుమారి. హైదరాబాద్ సిటీ పోలీసులు(Hyderabad City Police) ఈ డైలాగ్ తో నిర్లక్ష్యంగా వ్యవహరించే వాహనదారులను అలర్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

వాహనదారుడికి కుమారి ఆంటీ డైలాగ్

హెల్మెట్ లేకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ బైక్ నడుపుతున్న ఓ వాహనదారుడి ఫొటోను హైదరాబాద్ సిటీ పోలీసులు(Hyderabad City Police) ఎక్స్ లో ట్వీట్ చేశారు. దీనికి క్యాప్షన్ గా ” మీది మొత్తం వెయ్యి అయ్యింది. యూజర్ ఛార్జెస్ ఎక్స్ ట్రా” అంటూ ట్వీట్ చేశారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం, ట్రాఫిక్ నియమాలను పాటించండి, సేఫ్ డ్రైవింగ్ చేయండని పోలీసులు యాష్ ట్యాగ్ లు జోడించారు. సిటీ పోలీసుల వినూత్న ప్రయత్నంపై నగర వాసులతో పాటు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

Trending TelanganaTelangana NewsHyderabadHyderabad TrafficTs PoliceTelugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024