YSRCP Nandigama :

చెవిటికల్లు గ్రామంలో అంగన్వాడి కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
చెవిటికల్లు గ్రామంలో “జల జీవన్ మిషన్” ద్వారా వాటర్ లైన్ ఏర్పాటు పనులను ప్రారంభించిన డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కంచికచర్ల మండలంలోని చెవిటికల్లు గ్రామంలో రూ.16 లక్షల అంచనా విలువతో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడి కేంద్ర భవన నిర్మాణానికి మరియు రూ.6 లక్షల అంచనా విలువతో “జల జీవన మిషన్” ద్వారా ఇంటింటికి కుళాయి పథకంలో భాగంగా వాటర్ లైన్ ఏర్పాటు పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు శంకుస్థాపన నిర్వహించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని , అందులో భాగంగానే గ్రామాల్లో అంగన్వాడి కేంద్ర భవనాలు , ఇంటింటికి కుళాయిలు, నాడు నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి , విలేజ్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణం , గ్రామ సచివాలయ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు ,ఇంటింటికి సురక్షితమైన మంచినీటిని అందించటమే జలజీవన్ మిషన్ లక్ష్యమని , జలజీవన్ మిషన్ ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కలెక్షన్లు అందిస్తామని తెలిపారు , పనులను తరితగతిన పూర్తి చేసి తాగునీటిని సరఫరా చేయాలని కాంట్రాక్టర్లకు అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు సూచించారు ,
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మలక్ బషీర్ ,వైస్ ఎంపీపీ వెలగలేటి మాధవి ,గ్రామ సర్పంచ్ బుడ్డి విజయలక్ష్మి సత్యం తదితరులు పాల్గొన్నారు ..