YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.01-12-2022(గురువారం) ..
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికి వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలి ..
పల్లగిరి గ్రామంలో మండల బూత్ కన్వీనర్ల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
నందిగామ మండలంలోని పల్లగిరి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల బూత్ కన్వీనర్లతో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు పాల్గొన్నారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని , ప్రతిపక్షాల మరియు ఎల్లో మీడియా దుష్ప్రచారాలు తిప్పికొట్టేలా ఆయా పోలింగ్ బూత్ ల పరిధిలో బూత్ కన్వీనర్లు బాధ్యత వహించాలని , అదేవిధంగా రానున్న సార్వత్రా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల లిస్ట్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు ,పార్టీ అధిష్టానం ఆదేశానుసారం మరొకసారి బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని , బూతు కన్వీనర్లు -బూత్ కమిటీ సభ్యులకు పార్టీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ,గత ఎన్నికల సమయంలో బూత్ కన్వీనర్లుగా బాధ్యతలు తీసుకున్న వారికి పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని విధాలుగా అండగా ఉందని ,పలువురికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వటం మరియు పార్టీ పదవులు ఇవ్వటం చేసిందని గుర్తు చేశారు , మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయటానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ..
ఈ కార్యక్రమంలో ఏపీ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మంగునూరు కొండారెడ్డి ,మండల పార్టీ కన్వీనర్ నెలకుదిటి శివ నాగేశ్వరరావు ,ఎంపీపీ అరిగెల సుందరమ్మ ,వైస్ ఎంపీపీ ఆకుల హనుమంతరావు (రంగా) , గ్రామ సర్పంచ్ రవికిరణ్ రెడ్డి, నాయకులు బుచ్చిరెడ్డి ,చలమల మధు , ఐలపాటి రామయ్య తదితరులు పాల్గొన్నారు ..