YSRCP Nandigama : కంచికచర్ల మండల- పట్టణ బూత్ కన్వీనర్ల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ..

 

 

ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల :
ది.01-12-2022(గురువారం) ..

ప్రజల దీవెనలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బలం ..

కంచికచర్ల మండల- పట్టణ బూత్ కన్వీనర్ల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

రానున్న ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది ..

కంచికచర్ల పట్టణంలోని ఓసి క్లబ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల -పట్టణ బూత్ కన్వీనర్లతో గురువారం రాత్రి నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు పాల్గొన్నారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ అధినేత -ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం బూత్ కమిటీల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు ,గత ఎన్నికలకు పని చేసిన పార్టీ బూత్ కన్వీనర్లను -కమిటీ సభ్యులను దృష్టిలో ఉంచుకొని వచ్చే ఎన్నికలకు బూత్ కమిటీలను సిద్ధం చేస్తున్నామన్నారు ,పార్టీ అధినేత పిలుపుమేరకు 175 స్థానాలకు 175 స్థానాలు గెలిచేలా పార్టీ ప్రణాళిక రూపొందిస్తుందని ,దానికి అనుగుణంగానే అన్ని నియోజకవర్గాల్లో బూత్ కమిటీలను నియమించి బాధ్యతలను కేటాయిస్తున్నామన్నారు ,ఆయా బూత్ పరిధిలోని ఓటర్ లిస్ట్ ను పూర్తిస్థాయిలో పరిశీలించి , కొత్త ఓట్లను చేర్పించడం ,డబుల్ ఎంట్రీ ఓట్లను – మరణించిన వారి ఓట్లను తొలగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు ,రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు ..

ఈ కార్యక్రమంలో పట్టణ -మండల పార్టీ కన్వీనర్ లు వేమా సురేష్ బాబు- నన్నపనేని నరసింహారావు , ఎంపీపీ మలక బషీర్ , వైస్ ఎంపీపీ బండి మల్లికార్జునరావు , మాజీ అధ్యక్షులు బండి జానకిరామయ్య , జడ్పిటిసి వేల్పుల ప్రశాంతి , గ్రామ సర్పంచ్ వేల్పుల సునీత, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మార్త రజిని ,నాయకులు కాలవ పెదబాబు , పరిటాల రామకోటేశ్వరరావు , కాలవ వాసు తదితరులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *