YSRCP Nandigama : మొండితోక అరుణ్ కుమార్ గారితో రంగా అభిమానులు ,కాపు సంఘ నాయకుల భేటీ ‌.‌.

YSRCP Nandigama :

 

 

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.02-12-2022(శుక్రవారం) ..

ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారి సొంత నిధులతో వంగవీటి మోహన రంగా విగ్రహం ఏర్పాటు చేస్తాం : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారితో రంగా అభిమానులు ,కాపు సంఘ నాయకుల భేటీ ‌.‌.

నందిగామ గాంధీ సెంటర్ లో డిసెంబర్ 26 న రంగా విగ్రహావిష్కరణకు సన్నహాలు ..

ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారి సోదరులకు కృతజ్ఞతలు తెలిపిన రంగా అభిమానులు -కాపు సంఘ నాయకులు ..

నందిగామ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని వంగవీటి మోహన రంగా అభిమానులు ,కాపు సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి రంగా విగ్రహా ఏర్పాటుపై చర్చించారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందిగామ పట్టణంలో పేద ,బడుగు బలహీనవర్గాల నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి విగ్రహ ఏర్పాటుకు ఎప్పటి నుంచో సన్నాహాలు చేస్తున్నామని , అనివార్య కారణాల రీత్యా విగ్రహ ఏర్పాటు పనులు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయని , మొన్న జరిగిన కాపు కార్తీక వన సమారాధన మహోత్సవంలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు రానున్న మోహన రంగా గారి వర్ధంతి లోపు విగ్రహా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మేరకు ఆయన సొంత నిధులతో వి.యం.రంగా గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ,ఎన్నో ఏళ్లుగా నందిగామ పట్టణంలో వంగవీటి మోహన రంగా గారి విగ్రహం ఏర్పాటు చేయాలనే రంగా అభిమానుల కోరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారి నేతృత్వంలో నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని రంగా అభిమానులు వెల్లడించారు ..

ఈ కార్యక్రమంలో వంగవీటి మోహనరంగా అభిమానులు, కాపు సంఘ నాయకులు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *