..

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.05-12-2022(సోమవారం) ..
పల్లగిరి గ్రామంలో సువర్చల ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఆలయ నిర్మాణానికి రూ.26 లక్షలు మంజూరు చేసిన వై.యస్.జగన్ ప్రభుత్వం ..
నందిగామ మండలంలోని పల్లగిరి గ్రామంలో సువర్చల ఆంజనేయ స్వామి దేవాలయ పునః నిర్మాణ పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు సోమవారం శంకుస్థాపన చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తుందని , శిథిలావస్థకు చేరిన దేవాలయ పునః నిర్మాణాలకు, నూతన ఆలయాల నిర్మాణాలకు వేగవంతంగా నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు , అందులో భాగంగానే పల్లగిరి గ్రామంలో ఆలయ నిర్మాణానికి రూ.26 లక్షలు వైయస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసిందన్నారు ..
ఈ కార్యక్రమంలో ఏపీ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మంగునూరు కొండారెడ్డి, గ్రామ సర్పంచ్ రవికిరణ్ రెడ్డి , జడ్పిటిసి గాదెల బాబు , స్థానిక వైసీపీ నాయకులు , గ్రామస్తులు- భక్తులు పాల్గొన్నారు