YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.05-12-2022(సోమవారం) ..
గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
తోటి వారికి తోడ్పాటునందించడమే క్రీస్తు బోధనల సారాంశం ..
నందిగామ పట్టణంలోని జీడిఎంఎం కళాశాల ఆవరణలో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నిర్వహించిన గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు తావివ్వకుండా సత్ప్రవర్తనతో నడుచుకుంటూ తోటి వారికి తోడ్పాటునందించడమే ప్రభువైన యేసుక్రీస్తు బోధనల సారాంశమని , క్రిస్మస్ పండగ ఆచారాలకు సంబంధించిన పండుగ కాదని – ఆత్మీయతను పెంచే అనిర్వనచియమైన అనుభవమని చెప్పారు , ముఖ్యంగా క్రీస్తు బోధనలు చూపిన మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయమైనవని తెలిపారు , క్రీస్తు చూపిన మార్గంలో నడుచుకోవడం కొంత కష్టమైనప్పటికీ ఆచరించిన వారు అన్ని ఆటంకాలను అధిగమిస్తారన్నారు , అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును దైవజనులతో కలిసి కట్ చేశారు ..
ఈ కార్యక్రమంలో జీడిఎంఎం విద్యాసంస్థల అధినేత జీవి ప్రసాద రావు ,పాస్టర్లు జార్జి ముల్లర్ ,సోయాన్ రాజా ,నవీన్, జయరాజు ,లాయర్ మట్ట ప్రసాద్, వార్డు ఇన్చార్జి బండారు వెంకటరావు తదితరులు పాల్గొన్నారు ..