YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.06-12-2022(మంగళవారం) ..
డా”బి.ఆర్.అంబేద్కర్ గారికి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే డా”మొండితోక.జగన్ మోహన్ రావు ..
అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
భారత రాజ్యాంగ నిర్మాత డా”బాబాసాహెబ్ అంబేద్కర్ 66 వ వర్ధంతి సందర్భంగా నందిగామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డా”బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి ,నందిగామ గాంధీ సెంటర్లోని ఆయన విగ్రహానికి శాసనసభ్యుడు డా”మొండితోక.జగన్ మోహన్ రావు గారు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ శిల్పిగా ,ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా ,న్యాయ శాస్త్రవేత్తగా కీర్తి గాంచిన మహామేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశానికి ఎనలేని సేవలందించారని తెలిపారు ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని ,అంబేద్కర్ ఆశయాలకు ,ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడమే ఆయనకు ఇచ్చే ఘన నివాళులన్నారు ,సమాజంలోని పేద, బడుగు ,బలహీన వర్గాల మరియు వెనుకబడిన, పీడిత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా డా”బిఆర్.అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందిస్తే దాన్ని అమలు చేసే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మంచి పేరు సాధించారన్నారు ,
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు ,కోఆప్షన్ సభ్యులు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు ..