YSRCP Nandigama : బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

YSRCP Nandigama :

 

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.06-12-2022(మంగళవారం) ..

బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

రాజ్యాంగ విలువలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన ..

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66 వ వర్ధంతి సందర్భంగా శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు నందిగామ గాంధీ సెంటర్లోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సమాన విలువలు ఉండాలనే ఆకాంక్షతో సమానత్వ హక్కు సాధనకు అంబేద్కర్ చేసిన కృషి మానవజాతి మనుగడ ఉన్నంతవరకు మరువలేనిదని చెప్పారు , పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధిని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని , రాజ్యాంగ నిర్మాణం ద్వారా బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు నింపడానికి ఆయన కృషి చేశారని తెలిపారు , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన బాటలో నడుచుకుంటూ రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని అరుణ్ కుమార్ తెలిపారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దళిత చైతన్య వేదిక సభ్యులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *