YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.06-12-2022(మంగళవారం) ..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెనుకబడిన కులాలే వెన్నుముక : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
“జయహో బీసీ” మహాసభను విజయవంతం చేయాలి : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..
నందిగామ పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వైసిపి బిసి ప్రజా ప్రతినిధులు మరియు పార్టీ బిసి నాయకులతో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు జయహో బీసీ మహాసభ పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు .. అనంతరం జయహో బిసి మహాసభ పోస్టర్ ను ఆయన పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు ..
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు ఉన్న ప్రాధాన్యత దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని , బీసీలను మిగతా సామాజిక వర్గాలతో సమానంగా చూడాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్దేశమని తెలిపారు , బీసీల్లో 139 కులాలు ఉన్నాయని – వాటన్నిటినీ సంఘటితం చేసి అన్ని కులాల వారికి మేలు జరిగేలా ప్రభుత్వం పని చేస్తుందన్నారు , రాష్ట్ర మంత్రివర్గ ఏర్పాటులోనూ – నామినేటెడ్ పదవుల్లోనూ – నామినేటెడ్ వర్కులలోను 50 శాతానికి పైగా బీసీలకు కేటాయించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు ,ఎన్నికల ముందే బీసీ డిక్లరేషన్ ప్రకటించారని ,అధికారంలోకి వచ్చాక బీసీ డిక్లరేషన్‌లో చెప్పిన ప్రతి అంశాన్ని ప్రభుత్వం అమలు చేయడం హర్షణీయమని తెలిపారు , రేపు విజయవాడలో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న జయహో బీసీ మహాసభలో నందిగామ నియోజకవర్గ బీసీ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు ..
ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ ప్రజా ప్రతినిధులు, బీసీ నాయకులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు ..