YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.06-12-2022(మంగళవారం) ..
కె.వి.ఆర్ కళాశాలలో ఉమెన్స్ కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
కె.వి.ఆర్. కళాశాల లోని 300 మంది పేద విద్యార్థుల బస్ పాసుల ఖర్చును (సుమారు రూ.3 లక్షలు) తన సొంత నిధులతో చెల్లిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
నందిగామ పట్టణంలోని కె.వి.ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కృష్ణా యూనివర్సిటీ స్థాయి అంతర్ కళాశాలల ఉమెన్స్ కబడ్డీ పోటీలను శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు మంగళవారం ప్రారంభించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకు మానసిక వికాసాన్ని కలిగిస్తాయని , విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని తద్వారా పలు అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు , గ్రామీణ ప్రాంతాల్లో పేద క్రీడాకారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని , ఇటువంటి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పారు , అనంతరం కె.వి.ఆర్ కళాశాలలో విద్యను అభ్యసించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి విద్యార్థులు బస్సులో రావడం , ప్రయాణానికి బస్సు పాస్ ల నిమిత్తం ప్రతినెల డబ్బులు చెల్లించాల్సి రావడంతో భారంగా ఉందని విద్యార్థులు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారి దృష్టికి తీసుకురాగా , వెంటనే స్పందించిన ఆయన కె.వి.ఆర్ కళాశాలలో విద్యను అభ్యసించడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వస్తున్న సుమారు 300 మంది విద్యార్థులకు సంవత్సర కాలం పాటు అయ్యే బస్ పాసుల ఖర్చును సుమారు రూ.3 లక్షల తన సొంత నిధులతో చెల్లిస్తానని హామీ ఇచ్చారు ..
ఈ కార్యక్రమంలో కెవిఆర్ కళాశాల పిటి వాసిరెడ్డి నాగేశ్వరరావు , అధ్యాపకులు వాసుదేవరావు , స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..