టీడీపీ బీసీ డిక్లరేషన్ కాపీ పేస్ట్ ప్రోగ్రాం

Best Web Hosting Provider In India 2024

 

బీసీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు

బీసీలకు అన్ని చోట్లా ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు సీఎం వైయ‌స్‌ జగన్‌  

మీడియా స‌మావేశంలో  మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ 

తూర్పుగోదావరి: బీసీ డిక్లరేషన్ అనే కాపీ పేస్ట్ ప్రోగ్రాం చంద్రబాబు ప్రదర్శించాడ‌ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ విమ‌ర్శించారు. బీసీలను నమ్మించి దగా చేసిన పార్టీ టీడీపీ. రాజ్యాంగ విలువలను ఏమాత్రం కాపాడని పార్టీ టీడీపీ. బీసీలను దగా చేసిన నాయకుల చరిత్ర తీస్తే మొదటి పేరు చంద్రబాబుది అంటూ ధ్వ‌జ‌మెత్తారు. సీఎం వైయ‌స్ జగన్‌ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన నాయకుడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమ‌ర్శించారు. బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ఏరోజైనా మేనిఫెస్టోను అమలు చేశారా? అంటూ దుయ్యబట్టారు. బీసీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.

బీసీలకు అన్ని చోట్లా ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు సీఎం వైయ‌స్ జగన్‌  బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్న వ్యక్తి చంద్రబాబు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను చంద్రబాబు పట్టించుకోలేదు అంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు.

ప్రతి ఐదేళ్లకొకసారి బీసీలను మోసగించడం చాలా సులభం అని నమ్మిన వ్యక్తి చంద్రబాబు. టీడీపీ ఆశయాలు లక్ష్యాలు ఎన్టీ రామారావుతోనే కనుమరుగైపోయాయి. ఎన్టీఆర్ ఆశయాలను తుంగలో తొక్కి ఓట్ల కోసం ఆయన పేరు మాత్రం జపం చేస్తాడు. 2009లో ఆల్ ఫ్రీ అన్నాడు.. బీసీల కోసం 142 హామీలు ఇచ్చాడు. అందులో ఎన్ని హామీలను అమలు చేశారు.. ఒక్కటి కూడా అమలు కాలేదు’’ అని మంత్రి నిప్పులు చెరిగారు.

ప్రతి ఐదేళ్లకు  చంద్రబాబు ఒక వేషం వేస్తాడు. ఉచిత విద్యుత్ గురించి మాట్లాడితే రైతులను కాల్పించావు. బీసీలకు విద్యను అందకుండా చేసిన బీసీ ద్రోహి చంద్రబాబు. వైయ‌స్ఆర్‌ ఫీజు రియంబర్స్‌మెంట్‌ అమలు చేసినప్పుడు బీసీ విద్యార్థులు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు సీఎం వైయ‌స్ జగన్‌ అమలు చేస్తున్నారు. ఆదరణ పేరుతో నాసిరకం వస్తువులు ఇచ్చావు. నాయి బ్రాహ్మణులకు తోకలు కత్తిరిస్తారు అన్నావ్. జడ్జిలుగా బీసీలు పనికిరారు అన్నావ్  అని మంత్రి గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి కులగణన చేయించారు.. త్వరలోనే ప్రకటన చేస్తార‌ని మంత్రి చెల్లుబోయిన తెలిపారు. బీసీలు అంటే చంద్రబాబు దృష్టిలో బానిసలు. అందుకే తప్పులు చేసిన చంద్రబాబును న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టాడు సీఎం వైయ‌స్‌ జగన్‌. సీఎం వైయ‌స్ జగన్ హయాంలో బీసీలు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నారు. బీసీ బిడ్డలు ఇంగ్లీష్ చదవకూడదా… ఎందుకు అడ్డుపడ్డావ్ అని ప్ర‌శ్నించారు.

సీఎం వైయ‌స్ జగన్ హయాంలో లక్షా 73 వేల కోట్ల రూపాయలు బీసీల ఖాతాల్లో నేరుగా చేరింది. సీఎం వైయ‌స్ జగన్ క్యాబినెట్‌లో పదిమంది బిసీ మంత్రులున్నారు. 13 జిల్లా పరిషత్తులు ఉంటే ఆరు బీసీలకు ఇచ్చిన ఘనత వైయ‌స్ జగన్ దే. 139 కులాలకు 56 కార్పొరేషన్లు  ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైయ‌స్ జగన్‌దే. జిల్లాలో ఉన్న అన్ని వెనుకబడిన కులాలు మీ కళ్లు తెరిపించడానికి సిద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు చేసిన బీసీ డిక్లరేషన్ కాపీ పేస్ట్… మరోసారి బీసీలను మోసం చేయడానికే అంటూ మంత్రి వేణు మండిపడ్డారు.

2014 ఎన్నికలలో 142 హామీలను బీసీలకు ఇచ్చి ఒకటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. బీసీలను చంద్రబాబు తన హయాంలో బానిసలుగా చూసారని మంత్రి ధ్వజమెత్తారు. పవన్ ను కలుపుకుంటే గంపగుత్తుగా కాపుల ఓట్లు వచ్చేస్తాయని చంద్రబాబు కుట్ర చేశాడని, అయితే కాపులు విజ్ఞులు ఆలోచించి ఓటేస్తారని అన్నారు.  బీసీ డిక్లరేషన్ ప్రకటించే అర్హత టీడీపీ, జనసేనకు లేదన్నారు.

చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమి అమలు కావని, గతంలో 14 ఏళ్లు సీఎంగా చేసినప్పుడు చంద్రబాబుకు బీసీలు గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక అంటూ వారిని చంద్రబాబు వెన్నుపోడిచారని అన్నారు. మొన్న ప్రకటించిన టీడీపీ సీట్లలో బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు? అని ప్రశ్నించారు.. అంతేకాదు.. బీసీలకు సీట్లు తగ్గించేసారని ఆరోపించారు. బీసీలు చైతన్యం చెందారని, చంద్రబాబు చెప్పే మాటలు నమ్మే వారు లేరన్నారు. డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో శేట్టిబలిజలకు ఎన్ని సీట్లు ఇచ్చావో చెప్పాలని డిమాండ్‌ చేశారు.. బీసీలకు సీట్లు ఇవ్వకుండా రక్షణ చట్టం ఎలా తెస్తానని మండిపడ్డారు. తన సామజికవర్గానికే చంద్రబాబు ఎక్కువ సీట్లు ఇచ్చుకున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దుయ్య‌బ‌ట్టారు.

Best Web Hosting Provider In India 2024