Best Web Hosting Provider In India 2024
TS EdCET Registration Updates 2024 : బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రతి ఏడాది నిర్వహించే ఎడ్ సెట్ ప్రవేశ పరీక్షకు(TS EdCET 2024) సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి దరఖాస్తుల ప్రక్రియ(TS EdCET Registration 2024) ప్రారంభమైంది. మే 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా… ఆలస్య రుసుముతో మే 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మే 23వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది. రెండు షిఫ్టులో పరీక్ష ఉండగా…తొలి సెషన్ ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య ఉంటుంది. ఇక రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తారు.
ట్రెండింగ్ వార్తలు
How to register TS EdCET 2024: ఎలా దరఖాస్తు చేసుకోవాలి
అర్హులైన అభ్యర్థులు మొదటగా తెలంగాణ ఎడ్ సెట్ అధికారిక పోర్టల్ https://edcet.tsche.ac.in/ లోకి వెళ్లాలి.
Application Fee Payment పై నొక్కి దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
ఆ తర్వాత Fill Application Form అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మీ వివరాలను ఎంట్రీ చేయాలి. ఇందులో Payment Reference ID , Qualifying Examination Hall Ticket No , Mobile Numberతో పాటు పుట్టిన తేదీ వివరాలను ఇవ్వాలి. ఆ తర్వాత proceed to fill application పై క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
Print Your Filled in Application Form అనే ఆప్షన్ పై నొక్కి మీ రిజిస్ట్రేషన్ ఫారమ్ ను డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.
అప్లికేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్ల జారీతో పాటు ప్రవేశాల సమయంలో ఉపయోగపడుతుంది.
తెలంగాణ ఎడ్ సెట్ షెడ్యూల్ -2024
తెలంగాణ ఎడ్ సెట్ నోటిఫికేషన్ – మార్చి 04,2024.
దరఖాస్తుల రుసుం – ఓబీసీ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 550 చెల్లించాల్సి ఉంటుంది.
ఎడ్ సెట్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి తప్పనిసరిగా జులై 1, 2024 నాటికి 19 సంవత్సరాల వయస్సు ఉండాలి.అభ్యర్థికి గరిష్ట వయో పరిమితి లేదు. ఎ
ఎడ్ సెట్ దరఖాస్తుల స్వీకరణ – మార్చి 6,2024.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ – మే 06,2024.
లేట్ ఫీజుతో దరఖాస్తుల స్వీకరణ – మే 13,2024.
ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష – మే 23, 2024.
అధికారిక వెబ్ సైట్ – https://edcet.tsche.ac.in/
మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు పేపర్‌ను నిర్వహిస్తారు.
మూడు విభాగాలుగా ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ ఎలో ఇంగ్లిష్, పార్ట్ బిలో టీచింగ్ ఆప్టిట్యూడ్, పార్ట్ సిలో మెథడాలజీపై ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు పార్ట్ సి కోసం ఒక సబ్జెక్టును ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా… బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
NOTE : ఈ లింక్ పై క్లిక్ చేసి తెలంగాణ ఎడ్ సెట్ పరీక్షకు డైరెక్టుగా దరఖాస్తు చేసుకోవచ్చు
టాపిక్