Best Web Hosting Provider In India 2024
AP Farmers Input Subsidy: ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ డబ్బుల్ని నేడు విడుదల చేయనున్నారు.తాడేపల్లిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ రైతుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు.
ట్రెండింగ్ వార్తలు
2023లో వర్షాభావ పరిస్థితుల వల్ల ఏర్పడిన కరువు, 2023 డిసెంబర్లో వచ్చిన మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో పంటల్నిCrop loss కోల్పోయిన రైతులకు బీమా Insurance డబ్బులు విడుదల చేయనున్నారు.
గత ఏడాది కురిసిన అధిక వర్షాల వల్ల నష్టపోయిన 11,59,126 మంది వ్యవసాయ, ఉద్యానవన రైతులకు రూ. 1,294.58 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
2024లో జమ చేస్తున్న రూ. 1,294.58 కోట్లతో కలిపి ఈ 57 నెలల్లో వర్షాభావం (కరువు), తుఫాను, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన 34.41 లక్షల మంది రైతులకు మొత్తం ఇన్పుట్ సబ్సిడీగా రూ.3,262 కోట్లు చెల్లించారు.
ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు సత్వర ఉపశమనం కల్పించేలా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగానే నష్ట పరిహారం పంపిణీ చేస్తున్నామని ఏపీ వ్యవసాయ శాఖ చెబుతోంది.
దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం కారణంగా 2023 ఖరీఫ్ సీజన్‌లో ఏర్పడిన కరువుతో పాటు 2023-24 రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుపాన్‌తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ) అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. రెండు విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు రూ.1,294.58 కోట్లు అందిస్తున్నారు.
ఈ నెల 6వ తేదీన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి బాధిత రైతుల ఖాతాలకు నేరుగా సాయాన్ని జమ చేయనున్నారు.
గత వారం వైఎస్సార్ రైతు భరోసాతో పాటు సున్నా వడ్డీ రాయితీ కింద రైతన్నలకు రూ.1,294.34 కోట్లు అందించారు. వారం తిరగకముందే మరోసారి అన్నదాతలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు చెబుతున్నారు.
ప్రకృతి వైపరీత్యాల వేళ పంటలు కోల్పోయిన రైతులకు ఆ సీజన్ ముగియకుండానే పరిహారాన్ని అందజేస్తున్నారు. పైసా కూడా బకాయి పెట్టకూడదన్న సంకల్పంతో ఏ సీజన్‌లో జరిగిన నష్టాన్ని అదే సీజన్ ముగిసేలోగా అందిస్తున్నారు. వర్షాభావంతో గతేడాది ఖరీఫ్‌లో 84.94 లక్షల ఎకరాలకు గానూ 63.46 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి.
కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఆరు ప్రామాణికాల ఆదారంగా నష్టాన్ని లెక్కిస్తున్నారు. వర్షపాతం, పంట విస్తీర్ణం, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి, జలప్రవాహం, భూగర్భ జలాలు, జలాశయాల స్థాయిలు ఆధారంగా ఏడు జిల్లాల్లో 103 మండలాలు కరువుబారిన పడినట్లు గుర్తించారు.
మెట్ట పరిస్థితులతో 14,23,995.5 ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట నష్టపోయినట్లు గుర్తించారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత 6.96 లక్షల మంది రైతులకు రూ.847.22 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాలని లెక్క తేల్చారు.
22 జిల్లాల్లో మిచాంగ్ Michaung ప్రభావం
మిచాంగ్ (Michaung ) (మిగ్‌జామ్) తుపాన్ వల్ల 22 జిల్లాల్లో 6,64,380 ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. Michaung లో నష్టపోయిన 4.61 లక్షల మంది రైతులకు రూ.442.36 కోట్లు పెట్టుబడి రాయితీ చెల్లించాలని అంచనా వేశారు.
ఖరీఫ్ సీజన్‌లో ఐదు వేల ఎకరాల్లో పంట నష్టపోయిన 1892 మంది రైతులకు రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని అంచనా వేశారు. మొత్తం 20,93,377 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న 11,59,126 మంది రైతులకు రూ.1,294.58 కోట్ల పరిహారం చెల్లించాలని లెక్క తేల్చారు. వీరందరికి నేడు నష్ట పరిహాారం చెల్లించనున్నారు.
కేంద్రం నిర్ణయించిన దాని కంటే ఎక్కువ సాయం అందించాలన్న లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడి రాయితీని ప్రభుత్వం పెంచింది. వ్యవసాయ భూముల్లో మట్టి, ఇసుక మేటలు తొలగించేందుకు గతంలో హెక్టారుకు రూ.12 వేలు ఇవ్వగా దాన్ని రూ.18 వేలకు పెంచినట్టు ఏపీ వ్యవసాయ శాఖ చెబుతోంది.
దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టార్‌కు రూ.6800 చొప్పున ఇస్తున్న పరిహారాన్ని రూ.8500కు పెంచారు. నీటి పారుదల భూములైతే గతంలో రూ.13,500 చొప్పున చెల్లించిన పరిహారాన్ని రూ.17 వేలకు పెంచారు.
వరి, వేరుశనగ, పత్తి, చెరకు తదితర పంటలకు గతంలో హెక్టార్‌కు రూ.15 వేల చొప్పున ఇస్తుండగా దాన్ని రూ.17 వేలకు పెంచారు. ఉద్యాన పంటలకు రూ.7500 నుంచి రూ.17 వేలకు పెంచారు. మామిడి, నిమ్మ జాతి తోటలకు రూ.20 వేల నుంచి రూ.22,500 చొప్పున, మల్బరీకి రూ.4800 నుంచి రూ.6వేలకు పెంచి ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వంపై భారం పడినప్పటికీ కష్టాల్లో ఉన్న రైతులకు ఎంత చేసినా తక్కువే అనే ఉద్దేశంతో పెట్టుబడి రాయితీని పెంచి మరీ ప్రభుత్వం చెల్లిస్తోంది.
గత 57 నెలల్లో 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీని అందించారు. తాజాగా చెల్లించే సాయంతో కలిపితే 34.44 లక్షల మంది రైతులకు రూ.3,271 కోట్లు కానుంది.
టాపిక్