Merry Christmas OTT Release: మేరీ క్రిస్మస్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Best Web Hosting Provider In India 2024

Merry Christmas OTT: తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, బాలీవుడ్ అందాల హీరోయిన్ కత్రినా కైఫ్ కాంబినేషన్‍లో మేరీ క్రిస్మస్ మూవీ వచ్చింది. మంచి అంచనాలు, క్యూరియాసిటీ మధ్య ఈ చిత్రం జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ హైప్‍తో రిలీజ్ అయిన మేరీ క్రిస్మస్ బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది. మేరీ క్రిస్మస్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

 

ట్రెండింగ్ వార్తలు

మేరీ క్రిస్మస్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. మార్చి 8వ తేదీన ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేలా మెర్రీ క్రిస్మస్ మూవీ మేకర్లతో ఓటీటీ డీల్ చేసుకుంది నెట్‍ఫ్లిక్స్. దాని ప్రకారం మార్చి 8వ తేదీన ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు సిద్ధమవుతోందని సమాచారం. సడెన్‍గానే ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్‌లో అడుగుపెట్టనుందని తెలుస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు ఈ చిత్రం వచ్చే అవకాశం ఉంది.

మేరీ క్రిస్మస్ గురించి…

మేరీ క్రిస్మస్ మూవీలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరోహీరోయిన్లుగా నటించగా.. అశ్వినీ కల్సేఖర్, ల్యూక్ కెన్నీ, పరి మహేశ్వరి శర్మ, సంజయ్ కపూర్, టినూ ఆనంద్, రాధికా ఆప్టే, గాయత్రీ కీలకపాత్రలు పోషించారు. హిందీ, తమిళంలో ద్విభాషా చిత్రంగా రూపొందింది. అంధాధున్ చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరక్కించారు.

మేరీ క్రిస్మస్ చిత్రానికి ప్రీతమ్, డానియెల్ బీ జార్జ్ సంగీతం అందించారు. టిప్స్ ఫిల్మ్స్, మ్యాచ్‍బాక్స్ పిక్టర్స్ బ్యానర్లపై రమేశ్ తౌరానీ, జయ తౌరానీ, సంజయ్ రౌట్రే, కేవల్ గార్గ్ సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ.60కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఈ మూవీకి రూ.30 కోట్లలోపే కలెక్షన్లు వచ్చాయి.

 

మేరీ క్రిస్మస్ స్టోరీ బ్యాక్‍డ్రాప్

1980ల బ్యాక్‍డ్రాప్‍లో మేరీ క్రిస్మస్ కథ సాగుతుంది. సుమారు ఏడేళ్ల తర్వాత ముంబైలోని తన ఇంటికి అల్బర్ట్ (విజయ్ సేతుపతి) వస్తాడు. చనిపోయిన తన తల్లి జ్ఞాపకాలు అతడికి గుర్తుకు వస్తాయి. క్రిస్మస్ అయిన ఆ రోజు అతడు డిన్నర్ కోసం ఓ రెస్టారెంట్‍కు వెళతాడు. అక్కడే మారియా (కత్రినా కైఫ్) అనే అందమైన మహిళ.. అల్బర్ట్‌కు పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య మాటలు కలుస్తాయి. కలిసి నడుస్తారు.. డ్యాన్స్ చేస్తారు. క్రిస్మస్ రోజున సంతోషంగా గడుపుతారు. ఆ తర్వాత మారియా.. ఆల్బర్ట్‌ను ఇంటికి ఆహ్వానిస్తుంది. ఇద్దరూ అక్కడికి వెళతారు. ఒకరి గతాన్ని ఒకరు చెప్పుకుంటారు. అయితే, ఇంట్లో మారియా భర్త జెరోమీ మృతదేహం కనిపిస్తుంది. దీంతో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు తీవ్రంగా మారతాయి. అల్బర్ట్ కూడా తన గురించి ఓ షాకింగ్ నిజాన్ని మారియాకు చెబుతాడు. మారియా భర్త ఎలా చనిపోయాడు? ఆల్బర్ట్ గతం ఏంటి? ఈ చిక్కుల నుంచి ఆల్బర్ట్, మారియా బయటపడ్డారా లేదా అనేది మేరీ క్రిస్మస్ మూవీలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024