Lootere Web Series Trailer: హాట్‌స్టార్‌లో థ్రిల్లింగ్ వెబ్ సిరీస్.. లూటేరే ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Best Web Hosting Provider In India 2024

Lootere Web Series Trailer: స్కామ్ 1992, స్కామ్ 2003లాంటి వెబ్ సిరీస్ తోపాటు బాలీవుడ్ లో షాహిద్, ఒమెర్టా, ఫరాజ్, అలీగఢ్ లాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ తెరకెక్కిన హన్సల్ మెహతా నుంచి మరో థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. ఈ సిరీస్ పేరు లూటేరే (Lootere Web Series). చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ మొత్తానికి బుధవారం (మార్చి 6) ట్రైలర్ రిలీజ్ తోపాటు స్ట్రీమింగ్ డేట్ నూ అనౌన్స్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

లూటేరే వెబ్ సిరీస్ ట్రైలర్

పైరేట్స్, షిప్ హైజాక్ కథ నేపథ్యంలో ఈ లూటేరే వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ మచ్ అవేటెడ్ సిరీస్ మార్చి 22 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. రజత్ కపూర్, అమృతా ఖన్విల్కర్, వివేక్ గోంబర్, ఆమిర్ అలీలాంటి వాళ్లు నటించిన ఈ లూటేరే వెబ్ సిరీస్ ట్రైలర్.. సోమాలియా పైరేట్స్ ఇండియన్ షిప్ ను హైజాక్ చేయడంతో మొదలవుతుంది.

జై మెహతా ఈ సిరీస్ ను డైరెక్ట్ చేయగా.. హన్సల్ మెహతా, షైలేష్ ఆర్ సింగ్ ప్రొడ్యూస్ చేశారు. సముద్రంలో ప్రయాణించే ఓడలను హైజాక్ చేసి అందులోని సొత్తు దోచుకోవడంలో సోమాలియా పైరేట్స్ ఆరితేరారు. అలాంటి పైరేట్స్ చేతికి భారత్ కు చెందిన ఓ ఓడ చిక్కడం, వాళ్లు అందులోని సిబ్బందిని బందీలుగా చేసుకోవడం, వాళ్లతోపాటు ఓడను విడిపించాలని 5 కోట్ల డాలర్లు డిమాండ్ చేయడంలాంటి సీన్లతో ట్రైలర్ అంతా ఆసక్తికరంగా సాగింది.

సోమాలియా పైరేట్స్ బారి నుంచి ఆ ఓడ, అందులోని సిబ్బంది ఎలా బయటపడ్డారన్నది ఈ సిరీస్ లో చూడాలి. హన్సల్ మెహతా తనయుడు జై మెహతా ఈ సిరీస్ డైరెక్ట్ చేశాడు. దీంతో ఈ సిరీస్ ట్రైలర్ ను హన్సల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “ఓ తనయుడి ప్రేమతో కూడిన శ్రమను ఎంతో గర్విస్తున్న తండ్రి మీ ముందుకు తీసుకొస్తున్నాడు. హాట్ స్టార్ స్పెషల్స్ లూటేరే అఫీషియల్ ట్రైలర్” అని అన్నాడు.

లూటేరే సిరీస్ స్ట్రీమింగ్ డేట్

లూటేరే వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మార్చి 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నిజానికి రెండేళ్ల కిందటే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి 2022లోనే టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే మొత్తానికి ఇన్నాళ్లకు ట్రైలర్ రిలీజ్ చేసి స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేయడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ షోపై హన్సల్ మెహతా స్పందించాడు.

“అంతర్జాతీయ హైజాకింగ్ సంక్షోభం, వాటిని తప్పించుకోవడానికి సిబ్బంది చేసే ప్రయత్నాలను ఈ షో ద్వారా మేము చూపించే ప్రయత్నం చేశాం. ఈ స్టోరీ ప్రేక్షకులను ఎమోషనల్ చేయడంతోపాటు ఓ థ్రిల్లింగ్ అడ్వెంచర్ చేసిన ఫీలింగ్ కలిగిస్తుంది. జై మెహతా, హాట్ స్టార్ తో తొలిసారి కలిసి పని చేయడం ఓ మంచి అనుభవం” అని హన్సల్ మెహతా అన్నాడు. షిప్ హైజాకింగ్ పై తీసిన లూటేరే మార్చి 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024