TS Indiramma Housing Scheme : తొలి విడతలో వారికే ‘ఇందిరమ్మ ఇండ్లు’..! 4 విడతలుగా సాయం, స్కీమ్ తాజా అప్డేట్స్ ఇవే

Best Web Hosting Provider In India 2024

Indiramma Housing Scheme Updates: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం…ఆరు గ్యారెంటీల హామీలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు హామీలను అమలు చేస్తుండగా… కీలకమైన ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్(Telangana Indiramma Housing Scheme) పై కూడా ప్రకటన చేసింది. మార్చి 11వ తేదీన భద్రాచలం వేదికగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. ఏ క్షణమైనా విధివిధినాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఇప్పటికే ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన(Praja Palana) కార్యక్రమం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. గ్యారెంటీ పథకాల కోసం మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్స్ అందిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో ఇచ్చిన గృహలక్ష్మి దర­ఖాస్తులను కాంగ్రెస్‌ సర్కార్ రద్దు చేయడంతో.. వారంతా తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. వీటి సంఖ్య 80 లక్షలకు పైగా ఉంది. ఈ స్కీమ్ కింద గృహనిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిచనుంది. ఈ నేపథ్యంలో ఈ స్కీమ్ పకడ్బందీగా అమలు చేయాలని చూస్తోంది ప్రభుత్వం. అయితే ఒకే ఆధార్ నెంబర్ తో వేర్వురు ప్రాంతాల్లో చేసిన దరఖాస్తులను గుర్తించేందుకు కూడా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సేవలను వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఏదో ఒక చోట స్వీకరించిన దరఖాస్తును మాత్రమే పరిణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.

భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక కీలకంగా మారింది. స్కీమ్ అమలుకు తేదీని ప్రకటించిన నేపథ్యంలో… ఏ క్షణమైనా విధివిధినాలతో కూడిన జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. రూ. 5 లక్షల సాయం ఏ విధంగా అందజేస్తారు…? దశల వారీగా ఇస్తారా…? ఇంటి నమూనాలు ఏ విధంగా ఉంటాయి..? వంటి పలు అంశాలపై క్లారిటీ ఇవ్వనుంది.

 

ఎవరు అర్హులు…?

Telangana Indiramma Housing Scheme News: పేదవాళ్ల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వటం, స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం అందజేయటం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం. ఈ నేపథ్యంలో అర్హులను ఏ ప్రతిపాదికన ఎంపిక చేస్తారనేది తేలాల్సి ఉంది. అయితే ప్రధానంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే తొలి విడతలో ప్రధానంగా సొంత జాగాలు ఉన్నవారిని అర్హలుగా గుర్తించే అవకాశం ఉందని తెలిసింది. తొలివిడత కింద ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికిి 3వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే జీవో జారీ చేసింది. సర్కార్ ఇచ్చే రూ.5 లక్షలను మూడు లేదా నాలుగు దశల్లో ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. గతంలో ఇందిరమ్మ ఇళ్లను పొందినవారికి ఈసారి అవకాశం ఇవ్వరని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం ఇచ్చే జీవోలో క్లారిటీ రానుంది.

ఈ స్కీమ్ అమలులో భాగంగా ముందుగా ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేయాలని సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకుంది సర్కార్. దశల వారీగా గూడు లేని నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చాలని భావిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. లబ్ధిదారులు సొంత ఇల్లు తనకు అనుగుణంగా నిర్మాణం చేపట్టినప్పటికీ తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా చూడాలన్నారు. ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతలను వివిధ శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించాలని సీఎం సూచించారు. జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో ఇంజనీరింగ్ విభాగాలకు ఈ బాధ్యతలను ఇవ్వాలని చెప్పారు. ఇందుకు సంంబధించిన పూర్తి వివరాలు మార్గదర్శకాల్లో ఉండనున్నాయి.

 
 
WhatsApp channel
 

సంబంధిత కథనం

టాపిక్

 
 
Indiramma Housing SchemeTelangana NewsTrending TelanganaCm Revanth ReddyPraja Palana ApplicationsFree Bus Scheme

Source / Credits

Best Web Hosting Provider In India 2024