Idli Kurma : అల్పాహారంలోకి కొత్తగా ఇడ్లీ కుర్మా రెడీ చేయండి.. టేస్టీగా ఉంటుంది

Best Web Hosting Provider In India 2024

ఉదయం ఇంట్లో ఇడ్లీని తయారు చేయాలని ప్లాన్ ఉందా? ఇడ్లీకి సైడ్ డిష్‌గా కుర్మా చేయండి? ఈ ఇడ్లీ కుర్మా చాలా రుచికరమైనది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టపడతారు. ఈ కుర్మా ఇడ్లీకే కాదు దోసెకి కూడా బాగుంటుంది. మీరు ఇడ్లీ కుర్మా ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

ట్రెండింగ్ వార్తలు

ఇడ్లీ కుర్మాకు కావాల్సిన పదార్థాలు :

నూనె – 1 టేబుల్ స్పూన్, పెద్ద ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 4, వెల్లుల్లి – 6, లవంగాలు నాలుగైదు, అల్లం – 3 ముక్కలు, సోంపు – 1 టేబుల్ స్పూన్, తురిమిన కొబ్బరి – 1/4 టేబుల్ స్పూన్, జీడిపప్పు – 6 (లేదా) వేరుశెనగ – 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క – 2 ముక్కలు, బిర్యానీ ఆకులు – 2, టమోటో – 2 (సన్నగా తరిగినవి), ఉప్పు – రుచి ప్రకారం, పసుపు పొడి – 1/4 tsp, ధనియాల పొడి – 1 1/2 tsp, నీరు – అవసరమైనంత, కొత్తిమీర – కొద్దిగా

ఇడ్లీ కుర్మా తయారీ విధానం

ముందుగా స్టౌ మీద కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఇంగువ వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించాలి.

తర్వాత అందులో కొబ్బరి తురుము, జీడిపప్పు వేసి బాగా కలిపి చల్లార్చి మిక్సీ జార్ లో వేసి కాస్త నీళ్లు పోసి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఓవెన్‌లో కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు వేసి వేగించాలి.

తర్వాత టొమాటోలు వేసి, కావల్సినంత ఉప్పు చల్లి టొమాటోలు మెత్తబడే వరకు కలుపుకోవాలి.

అనంతరం పసుపు, ధనియాల పొడి వేసి 2 నిమిషాల పాటు తిప్పాలి. కొబ్బరి తురుము వేసి కలిపి 10 నిమిషాలు ఉడకబెట్టాలి. చివరగా కొత్తిమీర చల్లితే రుచికరమైన ఇడ్లీ కుర్మా రెడీ.

ఇడ్లీ ఉప్మా రెసిపీ

మీకు రెగ్యూలర్‌గా ఇడ్లీ తిని తిని బోర్ కొడితే ఇడ్లీతో ఉప్మా చేసుకోవచ్చు. ఇడ్లీ ఉప్మా చేయడం చాలా సులభం. క్షణాల్లోనే సిద్ధం చేయవచ్చు. ఉదయం అల్పాహారం లేదా సాయంత్రం స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు

5- 6 ఇడ్లీలు, 2 టేబుల్ స్పూన్లు నూనె లేదా నెయ్యి, 1/2 టీస్పూన్ ఆవాలు, 1/2 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ శనగపప్పు, 1 టీస్పూన్ మినపపప్పు, 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 ఉల్లిపాయ, 1 టీస్పూన్ అల్లం తురిము, 1 రెమ్మ కరివేపాకు, 2 పచ్చి మిరపకాయలు, 1/4 టీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, ఉప్పు రుచికోసం

తయారీ విధానం

ముందుగా ఇడ్లీలను తీసుకొని ముక్కలుగా కట్ చేయాలి. లేదంటే వాటిని పిసికి మెత్తని పిండిలాగా చేసుకోవాలి.

అనంతరం బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేయించాలి. ఆపై పప్పులను వేసి రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.

ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, పసుపు వేసి బాగా కలుపుతూ ఉండాలి.

అనంతరం ఇడ్లీ ముక్కలు, కొత్తిమీర వేసి ప్రతిదీ బాగా కలపాలి. ఇడ్లీలు వేడిగా మారే వరకు మూతపెట్టి ఉడికించాల్సి ఉంటుంది. అంతే ఇడ్లీ ఉప్మా రెడీ.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024