Krishna mukunda murari serial march 7th episode: ముకుంద ప్లాన్ కనిపెట్టేసిన మురారి.. ఆదర్శ్ మాటలకు ఎమోషనల్ అయిన కృష్ణ

Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari serial march 7th episode: ఆదర్శ్ తో నిజం చెప్పలేకపోయానని మురారి చెప్పడంతో కృష్ణ షాక్ అవుతుంది. ఇక తను ఆదర్శ్ తో మాట్లాడాలని కృష్ణ డిసైడ్ అవుతుంది. ఒక వ్యక్తి ఏదో పార్సిల్ తీసుకొస్తాడు. ముకుంద దాన్ని తీసుకుని చాటుగా చీర కొంగులో పెట్టుకుని ఇంట్లోకి వెళ్తూ కృష్ణకి డ్యాష్ ఇస్తుంది. ముకుంద చేతిలో ఉన్న పార్సిల్ కిందపడిపోతే అది రేవతి తీసుకుంటుంది. కవర్ ఏంటని రేవతి ఓపెన్ చేయబోతుంటే నెయిల్ పాలిష్ అని అబద్ధం చెప్పి ముకుంద తీసుకుని వెళ్ళిపోతుంది. శోభనం అయ్యేసరికి వాడిని పట్టుకోలేకపోతున్నాం, అందరికీ ఫోన్ చేసి సంతోషంగా చెప్పుకుంటున్నాడని రేవతి చెప్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు

ముకుంద చేసిన పని చూసేసిన మురారి

ముకుంద ఏదో డబ్బాని మురారి వాళ్ళ గదిలో పెట్టాలని వెళ్తుంది. నన్ను టెన్షన్ లో పెట్టేసి హాయిగా నవ్వుకుంటున్నావా ఇప్పుడు ఎలా నవ్వుతావో చూస్తానని ముకుంద మనసులో అనుకుంటుంది. నా శోభనాన్ని ఎలాగైనా ఆపుకుంటాను, వాళ్ళ శోభనం మాత్రం జరగకూడదని ముకుంద గీతికకి చెప్తుంది. ఎందుకు టెన్షన్ నేను ఒక పౌడర్ పంపిస్తాను అది కృష్ణ రాసుకునేలా చెయ్యి మొహం మొత్తం దద్దుర్లు వచ్చేస్తాయి, ముహూర్తం బాగోక ఇలా జరిగిందని మీ శోభనం కూడా క్యాన్సిల్ చేయమని గీతిక ఐడియా ఇస్తుంది. ముకుంద కృష్ణ వాళ్ళ గదిలోకి వచ్చి పౌడర్ డబ్బా మార్చేస్తుంది. గదిలో నుంచి వెళ్లబోతుంటే మురారి ఎదురుపడతాడు.

చేయాల్సింది చేసి జారుకుంటావ్ ఏంటి? మా శోభనం ఆపడానికి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావ్. ఏంటది పౌడర్ డబ్బా మార్చేశావ్ అది రాసుకుంటే ఏమవుతుంది. దురదలు పుడతాయా. అది రాసుకుంటే గోకుతా కూర్చుంటాము శోభనం ఆగిపోతుంది ఇది నీ వెధవ ఐడియా అంతే కదా. కానీ ఇప్పుడు నేను చూసేశాను కదా అది పని చేయదు. ఇప్పుడు ఏం అర్థం అయ్యింది నువ్వు ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా మమ్మల్ని విడదీయలేవు. మా శోభనం జరుగుతుంది. ఈరోజు నుంచి మేము నిజమైన భార్యాభర్తలం కాబోతున్నాం ఇప్పుడేం చేస్తావ్ ఏం చేయలేవు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా నోరు మూసుకుని కాపురం చేసుకో అంటాడు. అది కలలో కూడా జరగదని అంటుంది.

 

ముకుందని అసహ్యించుకున్న మురారి

మరి ఏం చెప్తావ్ నేను తప్పు చేయడం లేదని అంటావా? ఇప్పుడు దొంగ చాటుగా నువ్వు చేసే ఈ పని ఏంటి తప్పు కాదా? నేను ఏం చేసినా నా ప్రేమ సారి మన ప్రేమని బతికించుకోవడానికి. ప్రేమ ప్రేమ.. అది ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం దాన్ని పట్టుకుని నువ్వు మనశ్శాంతి పోగొట్టుకుని మాకు మనశ్శాంతి లేకుండా ఎందుకు చేస్తున్నావ్. ఇప్పుడు నువ్వు అలాగే అంటావ్ మురారి కానీ నా ప్రయత్నాలు ఫలించి మన ప్రేమ నిలబడిన తర్వాత నువ్వే నన్ను మెచ్చుకుంటావ్. మెచ్చుకోవడం కాదు రోజు రోజుకీ నీ మీద అసహ్యం పెరిగేలా చేసుకుంటున్నావ్. నువ్వు ఒక్కసారి నీ మూసుకుపోయిన కళ్ళు తెరుచుకుని చూడు నీ మీద అణువణువునా ప్రేమ పెంచుకున్న ఆదర్శ్ కనిపిస్తాడు. ఒక అద్భుతమైన జీవితం కనిపిస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు మనసు మార్చుకో.

చాలు ఆపు మురారి. క్షణాల్లో మార్చుకోవడానికి ఇదేం కట్టుకున్న చీర కాదు మనసు. అది ఎప్పటికీ మారదు. మారాల్సిందే వేరే దారి లేదు. నేను బ్రతుక్కి అయినా రాజీనామా ఇస్తాను కానీ నీతో కలిసి బతకాలని అనుకోవడంలో మాత్రం రాజీ పడను. మా శోభనం ఎటూ జరగదు అలాగే మీ శోభనం కూడా జరగనివ్వను. జరిగి తీరుతుంది ముకుంద. చూద్దాం ఎవరి పంతం గెలుస్తుందో అనేసి వెళ్ళిపోతుంది. ఆదర్శ్ దగ్గరకి కృష్ణ వచ్చి మాట్లాడుతుంది. మీ ఫ్రెండ్స్ అంత ఫోర్స్ చేస్తుంటే వెళ్లొచ్చు కదా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రా అనేసరికి ఆదర్శ్ షాక్ అవుతాడు. నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావ్ కదా అంటాడు. అదేం లేదని అంటుంది.

 

దేవుడు దిగి వచ్చిన ముకుందని వదలనన్న ఆదర్శ్

ఈరోజు నా శోభనం కదా ఇక్కడ ముకుందని వదిలేసి అక్కడ ఫ్రెండ్స్ తో తాగుతూ ఎలా ఉంటాను. నేను ముకుంద సంతోషంగా ఉండాలని కోరుకునేది మీ ఇద్దరే. అలాంటిది నువ్వే వెళ్ళి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యి అంటే టెస్టింగ్ కాక మరేంటి. ఇందాక మురారి కూడా వచ్చి ముకుందని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. అప్పుడు నేను తన మనసులో లేనని చెప్పి వెళ్లిపోయాను కానీ ఇప్పుడు తన మనసులో నేనే ఉన్నానని తెలిశాక తనని వదిలి వెళ్లిపోతానా? ముకుంద పూర్తిగా మారిపోయింది ఇందాక గుడిలో నా కాలికి గాజు గుచ్చుకునేసరికి ఎంత బాధపడిందో తెలుసా? ఇప్పుడు నేను ఫ్రెండ్స్ దగ్గరకి వెళ్తే తాగుతాను. అలాగే శోభనం గదిలోకి వెళ్తే తను ఎంత బాధపడుతుంది. దేవుడే పిలిచినా నేను ముకుందని విడిచి ఎక్కడికీ వెళ్లను.

మురారి తండ్రిలా ఆలోచిస్తే నువ్వు తల్లిలా ఆలోచిస్తున్నావ్. మీరిద్దరూ నాకు కుటుంబం, బంధం విలువ నేర్పించారని అంటాడు. తన మాటలకు కృష్ణ ఎమోషనల్ అవుతుంది. ఇలా ఎమోషనల్ గా మాట్లాడితే ఏం చెప్తాం అందుకే ఏసీపీ సర్ కూడా ఏం మాట్లాడకుండా వచ్చేశారు. ఇప్పుడు జరగబోయే ప్రమాదాన్ని ఎలా ఆపాలని అనుకుంటుంది. ముకుంద అద్దం ముందు కూర్చుని మురారితో డాన్స్ వేసింది గుర్తు చేసుకుంటుంది.

 

మనసులో మాట చెప్పిన రేవతి

ఎందుకు మురారి ఇలా చేశావ్ నీ పడకగదిలోకి పాల గ్లాసుతో రావాల్సిన నన్ను పాలని విషంగా భావించే పరిస్థితి తీసుకొచ్చావ్. పరువు కుటుంబం కోసం నీ చుట్టూ దడి కట్టుకున్నావ్. పెళ్ళైన వాళ్ళని ప్రేమిస్తే తప్పు అయినప్పుడు ప్రేమించిన వాళ్ళని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయడం తప్పు కాదా? అప్పుడు నువ్వే కదా తప్పు చేసినట్టు మరి నాకెందుకు ఈ శిక్ష నేనేం తప్పు చేశానని అనుకుంటూ ఉండగా రేవతి వచ్చి రెడీ అవలేదా అంటుంది.

మధు వచ్చి నువ్వు రెడీ కాకముందు ఒక ఫోటో రెడీ అయిన తర్వాత ఒక ఫోటో ఆదర్శ్ పంపించమని చెప్పాడు. ఎందుకో మీరు మీరు చూసుకోండి అని తనని ఫోటోస్ తీస్తాడు. నువ్వు మారావని అందరూ అంటున్న ఈ క్షణంతో ఆ అనుమానం పోయింది. నువ్వు ఇలా రెడీ అవడం ఆదర్శ్ ని అంగీకరించడం చాలా సంతోషంగా ఉందని రేవతి చెప్తుంది. క్షమించండి అత్తయ్య నేను ఆదర్శ్ ని అంగీకరించలేను మీ సంతోషం క్షణాల్లో ఆవిరి కాబోతుంది.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024