Best Web Hosting Provider In India 2024
Ajith Hospitalized: కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ హాస్పిటల్‌లో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో గురువారం అజిత్ చేరిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. అజిత్ హాస్పిటల్ పాలవ్వడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అజిత్‌కు ఏమైందోనని ఫ్యాన్స్‌లో కంగారు మొదలైంది. అజిత్ కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే అజిత్ ప్రైవేట్ హాస్పిటల్‌కు వచ్చినట్లు తెలిసింది. డాక్టర్ల చెకప్‌లో కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నట్లు వెల్లడైందని చెబుతున్నారు. డాక్టర్ల సూచన మేరకు అజిత్ హాస్పిటల్‌లో జాయిన్ అయినట్లు చెబుతోన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో అజిత్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
అవన్నీ పుకార్లే…
అజిత్ అనారోగ్య సమస్యలంటూ జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన సన్నిహిత వర్గాలు కొట్టిపడేశాయి. అజిత్ తన నెక్స్ట్ మూవీ షూటింగ్ కోసం త్వరలోనే విదేశాలకు వెళ్లబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన మెడికల్ ఫార్మాలిటీస్‌ను కంప్లీట్ చేయడానికే అజిత్ హాస్పిటల్‌కు వచ్చారని ఆయన సన్నిహితులు చెబుతోన్నారు. ఈ ఫార్మాలిటీస్ పూర్తయిన వెంటనే అజిత్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారని అంటున్నారు. ఈ పుకార్లను అభిమానులు నమ్మవద్దని ఆయన టీమ్ తెలిపింది.
అజిత్ ప్రస్తతం విదా మయూర్చి సినిమా చేస్తోన్నాడు. తమిజ్ జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.