Krishna mukunda murari serial march 8th episode: మురారి బిడ్డని కనేది నేనే, తనతోనే జీవితం అని ఆదర్శ్ కి చెప్పేసిన ముకుంద

Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari serial march 8th episode: నువ్వు మారలేదని అందరి మనసులో ఏదో ఒక మూల అనుమానం ఉండేది. ఈ క్షణంతో అది కూడా పోయింది. నువ్వు ఆదర్శ్ ని అంగీకరించడం ఇలా రెడీ అవడం చాలా సంతోషంగా ఉందని రేవతి ముకుందతో చెప్తుంది. క్షమించండి అత్తయ్య నేను ఆదర్శ్ ని ఎప్పటికీ అంగీకరించలేను మీ సంతోషం క్షణాల్లో ఆవిరి కాబోతుందని ముకుంద మనసులో అనుకుంటుంది. భవానీ అక్క నిన్ను ఇలా చూస్తే చాలా సంతోషించేది నువ్వు ఎప్పుడెప్పుడు మనవడినో, మనవరాలిని ఇస్తావోనని ఎదురుచూస్తుంది. ఇంతకీ ఎవరిని ఇస్తున్నావని అడుగుతుంది. మనవడినో, మనవరాలిని ఖచ్చితంగా ఇస్తాను మీకు ఎవరు కావాలో చెప్పమని ముకుంద అంటే ఆ విషయం మీ అత్తయ్యని అడుగు అంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు

మురారి బిడ్డని నేనే కంటాను 

మీరే నా అత్తయ్య ఎప్పటికైనా మీ కొడుకు మురారి బిడ్డని నేను నా కడుపున మోసేది మీ మనవడినే ఇది మాత్రం జరిగి తీరుతుందని అనుకుంటుంది. మురారి అద్దం ముందు చూసుకుంటూ అచ్చం శోభనం పెళ్లి కొడుకులా బాగున్నావ్ కానీ శోభనం మాత్రం లేదు. నీ బతుకు ఏంటి ఇలా తయారైంది. ఇప్పుడు ఏమైనా నీ శోభనం జరుగుతుందా ఏంటి? ఇదంతా ఫేక్ సినిమా సెట్. అక్కడ చూస్తే ముకుంద అనే బాంబ్ ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో అర్థం కావడం లేదని కాసేపు తనని తాను తిట్టుకుంటాడు. మధు వచ్చి ఏంటి నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావ్ అంటాడు. పెద్దమ్మ నిన్ను రెడీ చేయమంటే వచ్చాను కానీ నువ్వు ఆల్రెడీ రెడీ అయిపోయావ్ అంటాడు. సరే ఆల్ ది బెస్ట్ అంటే మళ్ళీ మళ్ళీ చెప్పు అని మధుని విసిగిస్తాడు.

మధు ఆదర్శ్ దగ్గరకి వస్తాడు. ఆదర్శ్ ముకుంద ఫోటో చూసుకుంటూ మురిసిపోతాడు. శోభనం పెళ్లి కూతురుగా ఎంత బాగుందో అంటాడు. మురారి, నువ్వు మీ భార్యలని ఎంతగా ప్రేమిస్తున్నారు మీలాంటి వాళ్ళు దొరికినందుకు వాళ్ళు ఎంత అదృష్టవంతులోనని మధు అంటాడు. ఏం అలాంటి భార్యలు దొరకడం మా అదృష్టం కాదా? ముకుంద నాకు భార్యగా దొరకడం నా అదృష్టం కాదా అంటే నువ్వు ఇంకా అదృష్టవంతుడివని మధు కవర్ చేస్తాడు. ఫ్రెండ్స్ ఫోన్ చేసి డబ్బులు వేయమని ఆదర్శ్ ని విసిగిస్తారు. ఆనందం ఆపుకోలేక నా ఫ్రెండ్స్ కి చెప్పుకున్నాను పార్టీ అడిగారు డబ్బులు కొడుతూ కూర్చున్నానని ఆదర్శ్ చెప్తాడు.

 

శోభనం ఏర్పాటు చేసి తప్పు చేశానా?

మురారి ముకుంద చేసిన ప్లాన్ గురించి కృష్ణకి చెప్తాడు. అయినా ఎందుకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏం జరుగుతుందోనని ఎదురుచూస్తూ ఉండేది కదా అంటుంది. మనం ఏం చేసినా తను ప్లాన్స్ వేస్తూనే ఉంటుంది. మనం ఎలాగైనా కారణం చెప్పకుండా శోభనం ఆపాలని మురారి చెప్పిన మాటలు కృష్ణ గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు ఏం చేసినా ఈ శోభనం ఆగేలా లేదు. నా భర్తని నాకు కాకుండా చేసి తన సొంతం చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తాను అంటే ఆవేశంతో చెప్పిందని అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థం అయ్యింది ఈరోజు రాత్రి ఏం జరుగుతుందో ఆ పరిణామాలు నా జీవితం మీద కుటుంబం మీద ఎలాంటి పరిణామాలు చూపిస్తాయో. పెద్దత్తయ్య పెత్తనం అప్పగించిందని ఈ శోభనాలు ఏర్పాటు చేసి తప్పు చేశానా? ఈ శోభనాలు లేకపోతే ముకుంద మామూలుగా ఉండేది ఏమో పరిస్థితి శృతి మించేది కాదని కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటుంది.

రేవతి వస్తే ముకుంద వెళ్లిపోయిందాని అడుగుతుంది. లేదు మామూలుగా ఉందని అంటే శోభనం గదిలో నిజం చెప్పాలని ముకుంద డిసైడ్ ఉందని కృష్ణ అర్థం చేసుకుంటుంది. ముహూర్తం టైమ్ కి ఇద్దరినీ గదిలోకి పంపించాలని రేవతి సుమలతకి చెప్తుంది. మురారి దగ్గరకి వెళ్లాలని తొందరపడుతుంటే కాస్త ఆగమని సుమలత అంటుంది. 

 

చేతులెత్తేసిన మురారి 

ఆదర్శ్ ముకుందతో గడిపిన క్షణాలు తలుచుకుంటూ మురిసిపోతాడు. కృష్ణ పాల గ్లాసు పట్టుకుని మురారి గదిలోకి వెళ్తుంది. కృష్ణని అలా చూసి మురారి మైమరిచిపోయాడు. ముకుంద గురించి ఆలోచించావా లేదా అని కృష్ణ టెన్షన్ గా తలలో పూలు తీసేయబోతుంటే కనీసం శోభనం ఫీల్ లో ఉండనివ్వమని అంటాడు. ముకుంద నాలాగా పాల గ్లాసు తీసుకుని గదిలోకి వెళ్ళింది ఏం జరుగుతుందోనని టెన్షన్ గా ఉందని అంటుంది.

నాకు టెన్షన్ గా ఉంది ఏం చేస్తాం ఇప్పుడు మన చేతుల్లో ఏం లేదు తను ఏం చేసిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం తప్ప ఏం లేదని మురారి చెప్తాడు. ముకుంద గదిలోకి వెళ్ళిపోతుంది. శోభనం పెళ్లి కూతురుగా ముకుందని చూసి ఆదర్శ్ సంతోషంగా ఉంటాడు. ఈ క్షణం కోసం నువ్వు ఇలా దేవ కన్యలా నడిచి వస్తుంటే చూసి మురిసిపోయే అద్భుత క్షణం కోసం నేను ఎన్నాళ్ళుగానో ఆశగా ఎదురుచూశానో తెలుసా అని తన చేతిలోని పాల గ్లాసు అందుకోబోతుంటే ముకుంద దాన్ని తీసుకొనివ్వకుండా టేబుల్ మీద పెట్టేస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ముకుంద తను జీవితం పంచుకోవాలని అనుకుంది మురారితోనే అని ఆదర్శ్ తో తెగేసి చెప్తుంది.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024