Best Web Hosting Provider In India 2024
Egg Pulao: కోడిగుడ్లను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజుకో ఉడకబెట్టిన కోడి గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. నోరు చప్పగా ఉన్నప్పుడు కోడిగుడ్లతో ఇలా ఎగ్ పులావ్ ట్రై చేయండి. తినాలన్న కోరిక పెరుగుతుంది. అది కూడా కుక్కర్లో 20 నిమిషాల్లో వండేసుకోవచ్.చు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
ట్రెండింగ్ వార్తలు
ఎగ్ పులావ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
కోడిగుడ్లు – నాలుగు
బాస్మతి బియ్యం – ఒక కప్పు
నూనె – తగినంత
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
కారం – ఒక స్పూను
ధనియాల పొడి – ఒక స్పూను
పసుపు – పావు స్పూను
గరం మసాలా – అర స్పూను
మిరియాల పొడి – పావు స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
బిర్యానీ మసాలా – అర స్పూను
నీళ్లు – సరిపడినన్ని
పుదీనా తరుగు – మూడు స్పూన్లు
కొత్తిమీర – మూడు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
యాలకులు – రెండు
దాల్చిన చెక్క – ఒక ముక్క
బిర్యానీ ఆకు – రెండు
షాజీరా – అర స్పూను
అనాసపువ్వు – ఒకటి
లవంగాలు – నాలుగు
ఎగ్ పలావ్ రెసిపీ
1. కోడిగుడ్లను ముందుగానే ఉడకబెట్టుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేయాలి.
3. నూనె వేడెక్కాక పసుపు, కారం, చిటికెడు గరంమసాలా, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు ఉప్పు వేసి అందులో కోడిగుడ్లను వేసి వేయించుకోవాలి.
4. కోడిగుడ్లు రంగు మారేవరకు ఉంచి తీసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు అదే కుక్కర్లో మరి కొంచెం నూనెను వేసి లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, షాజీరా, అనాసపువ్వు వేసి వేయించుకోవాలి.
6. అవి వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసి వేయించాలి.
7. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి బాగా వేయించుకోవాలి.
8. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, బిర్యానీ మసాలా కూడా వేసి బాగా వేయించాలి.
9. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు పెరుగును వేసి చిన్న మంట మీద ఉడికించాలి.
10. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి.
11. ఆ బియ్యాన్ని ఇప్పుడు ఈ పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి.
12. బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లను వేసి పైన కొత్తిమీర, పుదీనా తరుగును, వేయించిన ఉల్లిపాయలు వేయాలి.
13. ముందుగా ఉడికించిన కోడిగుడ్లను కూడా అందులో వేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి.
14. రెండు విజిల్స్ వచ్చేవరకు ఉంచి ఆఫ్ చేయాలి.
15. ఆవిరిపోయే వరకు కుక్కర్ మూతను తీయకూడదు.
16. తర్వాత మూత తీసి సర్వ్ చేయాలి. దీన్ని రైతాతో తిన్నా బాగుంటుంది, లేదా నేరుగా అలాగే తిన్నా అదిరిపోతుంది.
స్పైసీగా తినాలనుకునేవారు కారం, పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. మధ్యస్థ కారం తినేవారికి ఇక్కడ మేము ఇచ్చిన కొలతలు సరిపోతాయి. అదే పిల్లలకైతే కొంచెం తగ్గించాలి. ఎగ్ పలావ్ కేవలం 20 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీ గా కూడా ఉపయోగపడుతుంది. ఈ పలావ్ను వండుతున్నప్పుడు మధ్యస్థ మంట మీదే వండాలని గుర్తుపెట్టుకోండి. ఇందులో కోడిగుడ్లను ఉడికించి వేసాము, కాబట్టి అందులోని పోషకాలు ఎక్కడికి పోవు. దీన్ని ఒక్కసారి చేశారంటే మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. డిన్నర్లో కూడా ఇది అదిరిపోతుంది.