Best Web Hosting Provider In India 2024
Vishwak Sen About Chandini Chowdary: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, బ్యూటిఫుల్ హీరోయిన్ చాందిని చౌదరి కలిసి నటించిన సినిమా గామి. ఇద్దరు తమ టాలెంట్‌తో సినీ ఇండస్ట్రీలో ప్రతి అడుగు కెరీర్ వైపు వేస్తూ ముందుకు సాగుతున్నారు. గామి సినిమాతో తొలిసారిగా వీరిద్దరు కలిసి నటించారు. గామి సినిమాకు విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి డెబ్యూ డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు విద్యాధర్.
ట్రెండింగ్ వార్తలు
గామి సినిమా మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టెక్నికల్‌గా సినిమా చాలా బాగుందని రివ్యూలు, ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో గామి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా కోసం చాందిని చౌదరి పడిన కష్టాన్ని తెలిపాడు విశ్వక్ సేన్. హీరో అడవి శేష్, డైరెక్టర్ అజయ్ భూపతి, హను రాఘవపూడి తదితరులు ముఖ్య అతిథులుగా హజరైన గామి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
“ఈ వేడుకు విచ్చేసిన శేష్ భాయ్, అజయ్ అన్న, హను రాఘపూడి గారు , అందరికీ పేరుపేరున ధన్యవాదాలు. దర్శకుడు విద్యాధర్ మాటల్లోని నిజాయితీని నమ్మాను. దాని ఫలితమే నా జీవితంలోకి గామి లాంటి సినిమా ఉంది. జీవితంలో నేను కలసిన అత్యంత నిజాయితీ గల వ్యక్తి విద్యాధర్. ఈ సినిమాతో విద్యా లాంటి స్నేహితుడిని సంపాదించుకున్నాను. డీవోపీ విశ్వనాథ్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. సినిమా విడుదల తర్వాత తన గురించి ప్రేక్షకులు చాలా గొప్పగా మాట్లాడుకుంటారు” అని హీరో విశ్వక్ సేన్ చెప్పాడు.
“ఒక మంచి సినిమా దాని లక్ష్యాన్ని అది చేరుకుంటుదనే నమ్మకంతో మొదలుపెట్టాం. విక్కీ అన్న ప్రాజెక్ట్ లోకి రావడంతో మా నమ్మకం నిజమైంది. ఆయన రావడంతో సినిమా స్కేల్ పెరిగింది. నరేష్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సంగీతం కథలో లీనం చేస్తుంది. హారిక అద్భుతంగా నటించింది. సమద్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది” అని గామి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ అన్నాడు.
“చాందినీ గ్రేట్ కోస్టార్. షూటింగ్‌లో వాష్ రూమ్ యాక్సెస్ ఉండకపోవడం వలన తను ఉదయం నుంచి సాయంత్రం వరకూ నీరు తాగేది కాదు. తన డెడికేషన్‌కి హ్యాట్సప్. ఆలోచనతో మొదలై మనసులో నిలిచిపోయే సినిమా ఇది. చాలా నిజాయితీగా చాలా రిస్క్‌లు తీసుకున్నాం. అవన్నీ ఫలితాన్ని ఇచ్చాయి. దేవుడు కూడా చూశాడని భావిస్తున్నాను. లీప్ ఇయర్‌లో ట్రైలర్ రిలీజ్ కావడం, మహాశివరాత్రికి సినిమా విడుదల కావడం మేము ప్లాన్ చేయలేదు. మా నిజాయితీకి ఎదో సూపర్ పవర్ యాడ్ అయింది” అని విశ్వక్ సేన్ తెలిపాడు.
“గామి సినిమా చూసినప్పుడు మనసు బరువెక్కింది. చాలా అనందంగా గర్వంగా అనిపించింది. కొత్తరకం సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ మూవీ గొప్ప సంతృప్తిని ఇస్తుంది. ప్రేక్షకులకు గర్వపడే సినిమా అవుతుంది. రీకాల్ వాల్యు ఉంటుంది. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా మిమ్మల్ని హాంట్ చేస్తుంది. ఈ గామిని ప్రేక్షకులు గొప్ప గమ్యానికి చేరుస్తారని మా టీం అంతా నమ్ముతున్నాం” అని విశ్వక్ సేన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
టాపిక్