Rajinikanth Lalsalaam: ర‌జ‌నీకాంత్ వ‌ల్లే లాల్‌స‌లామ్‌ ఫెయిలైంది – డిజాస్ట‌ర్‌ను తండ్రిపై రుద్దేసిన ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్

Best Web Hosting Provider In India 2024

Rajinikanth Lalsalaam: జైల‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ హీరోగా భారీ అంచ‌నాలు న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన లాల్‌స‌లామ్ డిజాస్ట‌ర్ అయ్యింది. ర‌జ‌నీకాంత్ కెరీర్‌లోనే అతి త‌క్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా లాల్‌స‌లామ్‌ నిలిచింది. తెలుగు వెర్ష‌న్ అయితే మ‌రీ దారుణంగా కోటి కూడా వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయింది. తొలిరోజే థియేట‌ర్ల‌లో జ‌నాలు లేక చాలా షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ర‌జ‌నీకాంత్ కెరీర్‌లో ఇలాంటి అవ‌మానం ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌ని, ఇదే ఫ‌స్ట్ టైమ్ అంటూ అభిమానులు ఫైర్ అయ్యారు.

 

ట్రెండింగ్ వార్తలు

ర‌జ‌నీకాంత్ కూతురు…

లాల్ స‌లామ్ సినిమాకు ర‌జ‌నీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్ గెస్ట్ రోల్ చేశాడు. విష్ణువిశాల్‌, విక్రాంత్ అస‌లు హీరోలుగా న‌టించారు. కానీ ర‌జ‌నీకాంత్ పేరును ప్ర‌మోష‌న్స్‌లో ఎక్కువ‌గా వాడుకున్నారు. అత‌డే ఈ సినిమాకు హీరో అంటూ ప్ర‌చారం చేశారు. సినిమాలో మాత్రం ర‌జ‌నీకాంత్ క్యారెక్ట‌ర్ 30 నిమిషాల లోపే ఉండ‌టం, పాత్ర‌కు స‌రైన ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంతో లాల్ స‌లామ్‌ను అభిమానులు తిర‌స్క‌రించారు.

ర‌జ‌నీకాంత్ వ‌ల్లే…

లాల్ స‌లామ్ రిజ‌ల్ట్‌పై ద‌ర్శ‌కురాలు ఐశ్వ‌ర్య ర జ‌నీకాంత్ రియాక్ట్ అయ్యింది. తండ్రి ర‌జ‌నీకాంత్ క్యారెక్ట‌ర్‌లో చేసిన మార్పుల వ‌ల్లే తాము అనుకున్న రిజ‌ల్ట్ రాలేద‌ని అన్న‌ది. ముందుగా తాను రాసుకున్న క‌థ‌లో ర‌జ‌నీకాంత్ క్యారెక్ట‌ర్ సెకండాఫ్‌లో కేవ‌లం ప‌ది నిమిషాలు మాత్ర‌మే క‌నిపిస్తుంద‌ని ఐశ్వ‌ర్య తెలిపింది. “ర‌జ‌నీకాంత్ కోసం సెకండాఫ్ వ‌ర‌కు అభిమానులు వేచిచూడ‌టం క‌ష్ట‌మ‌ని అనిపించింది. క‌థ‌లో ఆయ‌న పాత్ర మ‌రి చిన్న‌గా ఉంటే డిస‌పాయింట్ అవుతార‌ని భావించాం. రిలీజ్‌కు కొద్ది రోజుల ముందు ర‌జ‌నీకాంత్ క్యారెక్ట‌ర్‌లో చాలా మార్పులు చేశాం.

ఫ‌స్ట్‌హాఫ్‌లోనే ర‌జ‌నీ పాత్ర‌ను ప‌రిచ‌య‌మ‌య్యేలా సినిమాను ఎడిట్ చేశాం. సెకండాఫ్‌లో ర‌జ‌నీకాంత్ క్యారెక్ట‌ర్ లెంగ్త్ పెంచాం. ర‌జ‌నీకాంత్ పాత్ర కోసం క‌థ‌కు సంబంధం లేని చాలా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ సినిమాకు జోడించాల్సివ‌చ్చింది.ఈ క‌మ‌ర్షియ‌ల్ హంగుల కార‌ణంగా క‌థ వీక్ అయిపోయింది. స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ కూడా నేను అనుకున్న‌ట్లుగా కాకుండా మ‌రోలా మారిపోయింది” అని ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ తెలిపింది. ఈ మార్పుల‌న్నీ రిలీజ్‌కు రెండు రోజుల ముందు చేశామ‌ని, అది కూడా సినిమా ఫెయిల్యూర్‌కు ఓ కార‌ణ‌మ‌ని ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ అన్న‌ది. సినిమా రిజ‌ల్ట్‌కు తండ్రిని బాధ్యుడిని చేస్తూ ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

 

ధ‌నుష్ త్రీతో ఎంట్రీ…

ధ‌నుష్ త్రీ సినిమాతో డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చింది ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌. ఫ‌స్ట్ టైమ్ థియేట‌ర్ల‌లో ఫెయిలైన ఈ మూవీ ఆ త‌ర్వాత ధ‌నుష్ యాక్టింగ్‌, అనిరుధ్ మ్యూజిక్ వ‌ల్ల క‌ల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. త్రీ త‌ర్వాత వాయ్ రాజా వాయ్ అనే సినిమా చేసింది ఐశ్వ‌ర్య‌. కుటుంబ బాధ్య‌త‌ల కార‌ణంగా చాలా కాలం పాటు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌కు దూరంగా ఉన్న ఆమె తొమ్మిదేళ్ల త‌ర్వాత లాల్‌స‌లామ్‌తో మెగాఫోన్ ప‌ట్టింది.

నాలుగు సినిమాలు…

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. లాల్‌స‌లామ్ త‌ర్వాత జైభీమ్ ఫేమ్ టీజే జ్ఞాన‌వేళ్ ద‌ర్శ‌క‌త్వంలో వెట్టైయాన్ సినిమా చేస్తున్నాడు ర‌జ‌నీకాంత్‌. ఇందులో అమితాబ్‌బ‌చ్చ‌న్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. జైల‌ర్ 2 కూడా రాబోతోంది. అలాగే ర‌జ‌నీకాంత్, డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌క‌రాజ్ కాంబోలో ఓ మూవీ ఫిక్స‌యింది. బాలీవుడ్‌లో ఓ మూవీకి ర‌జ‌నీకాంత్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు.

WhatsApp channel
 

టాపిక్

 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024