Best Web Hosting Provider In India 2024
Guppedantha Manasu March 9th Episode: వసుధార, మను పోస్టర్స్ కాలేజీలో కలకలం రేపుతాయి. వసుధార, మను బంధాన్ని స్టూడెంట్స్, లెక్చరర్స్ తప్పుపడతారు. రిషికి అన్యాయం చేస్తున్నారంటూ వసుపై ఫైర్ అవుతారు. ఈ పోస్టర్స్ కారణంగా వసుధార తన ఎండీ పదవికి రాజీనామా చేసి కాలేజీ వదిలి దూరంగా వెళ్లిపోతుంది. వసుధార స్థానంలో శైలేంద్ర ఎండీ సీట్లో కూర్చోబోతుండగా కల నుంచి ఒక్కసారిగా బయటకు వస్తాడు. అదంతా కలలోనే జరిగిందని అర్థం చేసుకొని శైలేంద్ర చిరాకు పడతాడు.
ట్రెండింగ్ వార్తలు
మారిన పోస్టర్స్…
వసుధార కాలేజీలో అడుగుపెడుతుంది. స్టూడెంట్స్ అందరూ ఒకేచోట గుమిగూడి ఉండటంతో వసుధార అక్కడికి వెళ్లి ఏం జరుగుతుందో చూస్తుంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే వసుధార అంటూ కాలేజీ మొత్తం పోస్టర్స్ అంటించి ఉంటాయి. ఆ పోస్టర్స్ చూసి వసుధార షాకవుతుంది. రాజీవ్ అంటించిన పోస్టర్స్ ఎవరో మార్చేసి వసుధార బర్త్‌డే పోస్టర్స్.
శైలేంద్ర ఆనందం…
రాజీవ్ అంటించిన పోస్టర్స్ ద్వారా వసుధారను ఇరకాటంలో పెట్టాలని ఆనందంగా కాలేజీలో అడుగుపెడతాడు శైలేంద్ర. స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా పోస్టర్స్ చూస్తూ కనిపించడంతో తన ప్లాన్ వర్కవుట్ అయ్యిందని సంబరపడతాడు. ఆ పోస్టర్స్ చూసి వసుధార షాకవ్వడం ఖాయం అంటూ తెగ బిల్డప్‌లు ఇస్తాడు. భర్త ఎలాంటి కుట్ర చేశాడో అని భయంగా ధరణి పోస్టర్స్ చూస్తుంది. కానీ అక్కడ వసుధార బర్త్‌డే పోస్టర్స్ కనిపిస్తాయి. ఆ పోస్టర్స్ చూసి శైలేంద్ర షాకవుతాడు. రాజీవ్ అంటించిన పోస్టర్స్ స్థానంలో ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయో తెలియక కంగారుపడతాడు.
రాజీవ్ మాటల ప్రవాహం…
మీరు ఇచ్చిన సర్ప్రైజ్ చాలా బాగుందని శైలేంద్రను మెచ్చుకుంటుంది ధరణి. ఆమె సెటైర్‌కు శైలేంద్ర కోపం మరింత పెరుగుతుంది. ఆవేశంగా రాజీవ్‌కు ఫోన్‌చేస్తాడు. శైలేంద్రకు ఛాన్స్ ఇవ్వకుండా రాజీవ్ నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంటాడు. అంత మనం అనుకున్నట్లుగానే జరిగిందా…అవమానం భారంతో వసుధార కాలేజీ వదిలిపెట్టి వెళ్లిపోయిందా? మనుకు తల కొట్టేసినట్లు అయ్యిందా? అని శైలేంద్రతో అంటాడు రాజీవ్.
నిన్ను ఎవరూ ఆపలేరు. ఇక ఎండీ సీట్ నీకు దక్కినట్లేనని శైలేంద్రను తెగ పొగడుతాడు. అతడి మాటల ప్రవాహానికి శైలేంద్ర అడ్డుకట్టవేస్తాడు. ఇక్కడ నువ్వు అంటించిన పోస్టర్స్ లేవని, వాటి స్థానంలో వసుధార బర్త్‌డే పోస్టర్స్ ఉన్నాయని రాజీవ్‌కు చెబుతాడు. శైలేంద్ర చెప్పింది అబద్ధమని రాజీవ్ అనుకుంటాడు. తానే స్వయంగా కాలేజీకి వచ్చి ఆ పోస్టర్స్ చూడాలని ఫోన్ కట్ చేస్తాడు.
పోస్టర్స్ అంటించిన మను…
రాజీవ్ అంటించిన పోస్టర్స్ స్థానంలో వసుధార బర్త్‌డే పోస్టర్స్ మనునే అంటిస్తాడు. ఈ పోస్టర్స్ గురించి పీఏతో మను మాట్లాడుతుండగా వసుధార వింటుంది. మనుపై సీరియస్ అవుతుంది. నా పర్మిషన్ లేకుండా నా పోస్టర్స్ అంటించడం తప్పు అంటూ క్లాస్ ఇస్తుంది. మనుపై లీగల్‌గా యాక్షన్ తీసుకుంటానని అంటుంది. కంప్లైంట్ ఇచ్చిన తనకు పర్వాలేదని, ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కోవడానికి తాను సిద్ధమని మను బదులిస్తాడు.
నేనేం సెలబ్రిటీ కాదు…
పోస్టర్స్ అంటించి బర్త్‌డేలు జరుపుకోవడానికి నేనేం సెలబ్రిటీ కాదని మనుతో అంటుంది వసుధార. మీరు అందరికి సెలబ్రిటీ కాకపోవచ్చు. కానీ కాలేజీ స్టూడెంట్స్‌కు, మాకు మీరే సెలబ్రిటీ, మీ గొప్పతనం, మంచిఅందరికి తెలియాలనే అలా చేశానని వసుధారను కన్వీన్స్ చేసేందుకు మను ప్రయత్నిస్తాడు. గోడల మీద పోస్టర్స్ అంటించి నేను చేసిన మంచిని ప్రచారం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదని వసుధార అంటుంది.
ఇదంతా ఎందుకు చేశారో చెప్పమని మనును నిలదీస్తుంది వసుధార. రిషి కోసమే ఇదంతా చేశానని, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళుతున్న మీరు సంతోషంగా ఉండాలని పోస్టర్స్ అంటించానని మను చెబుతాడు. రిషి పేరుతో మీరు ఇలా చొరవ తీసుకోవడం బాగాలేదంటూ ఫైర్ అవుతుంది. మీరు చేసిన ప్రతి పనికి రిషిని అడ్డం పెట్టుకోవడం బాగాలేదని సరైంది కాదంటూ క్లాస్ ఇస్తుంది. ఆ పోస్టర్స్ మొత్తం తీసేయమని ఆర్డర్ వేస్తుంది.
ట్రైలర్ ఒకటి…సినిమా మరొకటి…
ఆ పోస్టర్ ఎలా మారాయో తెలుసుకోవడానికి కాలేజీకి వస్తాడు రాజీవ్. బర్త్‌డే పోస్టర్స్ చూసి రాజీవ్ కూడా షాకవుతాడు. ట్రైలర్ ఒకటేసి సినిమా ఇంకోటి చూపించావని రాజీవ్‌పై సీరియస్ అవుతాడు శైలేంద్ర. ఎవరు ఇదంతా చేశారో అర్థం కావడం లేదని రాజీవ్ అంటాడు. అప్పుడే అక్కడికి మను ఎంట్రీ ఇస్తాడు. ఈ పోస్టర్స్ మార్చింది తానే అని చెబుతాడు. అతడి మాటలతో శైలేంద్ర, రాజీవ్ మైండ్‌బ్లాంక్ అవుతుంది.
మను ఎంట్రీతో ఇద్దరు మాటలు మార్చేస్తారు. ఏం తెలియనట్లు ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు. మీ వెధవ వేషాలు అన్ని నాకు తెలుసు. ఇంత నీచంగా ఆలోచిస్తారా అంటూ ఇద్దరికి క్లాస్ పీకుతాడు. రాజీవ్ కుట్రను ఎలా అడ్డుకున్నది మను వివరిస్తాడు.
వసుధార, మను కలిసి దిగిన ఫొటోలను రాజీవ్ ప్రింటింగ్ చేయిస్తుండగా అనుకోకుండా అక్కడికి మను వస్తాడు. రాజీవ్ చేస్తోన్న కుట్ర గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత రాజీవ్ కాలేజీలో పోస్టర్స్ అంటించడం కూడా మను చూస్తాడు. అతడు ఫొటోలు అంటిస్తోండగా వీడియో కూడా తీస్తాడు. వీడియో గురించి చెప్పగానే రాజీవ్ భయపడతాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.