Bhimaa vs Gaami: గోపీచంద్ వ‌ర్సెస్ విశ్వ‌క్ సేన్ -ఫ‌స్ట్‌డే క‌లెక్ష‌న్స్‌లో భీమాను బీట్ చేసిన గామి

Best Web Hosting Provider In India 2024

Bhimaa vs Gaami: ఈ శుక్ర‌వారం గోపీచంద్ భీమాతో పాటు విశ్వ‌క్‌సేన్ గామి థియేట‌ర్ల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. ఫ‌స్ట్‌డే భీమాపై గామి డామినేష‌న్ కొన‌సాగింది. భీమా సినిమాకు ఫ‌స్ట్ షో నుంచే మిక్స్‌డ్ టాక్ రావ‌డంతో ఓపెనింగ్‌పై ఎఫెక్ట్ ప‌డింది. గామి సినిమా విజువ‌ల్స్‌, టెక్నిక‌ల్‌గా బాగుందంటూ ప్ర‌శంస‌లు రావ‌డంతో భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

ట్రెండింగ్ వార్తలు

భీమా క‌లెక్ష‌న్స్‌…

గోపీచంద్ భీమా సినిమా తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా మూడు కోట్ల ముప్పై ల‌క్ష‌ల‌ వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా బీ, సీ సెంట‌ర్స్‌లో భీమా మూవీ భారీగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. రొటీన్ క‌థ‌తో ద‌ర్శ‌కుడు హ‌ర్ష ఈ సినిమాను తెర‌కెక్కించ‌డంటూ కామెంట్స్ రావ‌డంతో ఓపెనింగ్స్‌పై ఎఫెక్ట్ ప‌డింది. టాక్ బాగుంటే భీమా సినిమా ఈజీగా ఐదు కోట్ల మార్క్‌ను ట‌చ్ చేసి ఉండేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. శుక్ర‌వారం నైజాం ఏరియాలో ఈ మూవీ కోటి ఎన‌భై ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు తెలిసింది. ఆంధ్రా, సీడెడ్ కోటి ఇర‌వై ల‌క్ష‌ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

పోలీస్ ఆఫీస‌ర్‌గా గోపీచంద్‌…

దాదాపు ప‌ద‌కొండు కోట్ల వ‌ర‌కు భీమా థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది. 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైంది. శ‌ని, ఆదివారాల క‌లెక్ష‌న్స్‌ను బ‌ట్టే భీమా సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా? అన్న‌ది డిసైడ్ కానుంద‌ని అంటున్నారు. భీమా సినిమాతో క‌న్న‌డ ద‌ర్శ‌కుడు హ‌ర్ష టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్‌గా గోపీచంద్ క‌నిపించాడు. మ‌హేంద్ర‌గిరి అనే ప్రాంతంలో భ‌వానీ అనే రౌడీ సాగిస్తోన్న అన్యాయాల‌కు భీమా అనే పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ముగింపు ప‌లికాడు. ఆ ప్రాంతంలో చాలా ఏళ్లుగా మూత‌ప‌డ్డ ప‌ర‌శురామ క్షేత్రాన్ని భీమా ఎలా తెరిపించాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

గామి ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌…

విశ్వ‌క్ సేన్ గామి తొలిరోజు తొమ్మిది కోట్ల ఏడు లక్షల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. విశ్వక్ సేన్ కెరీర్ లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీ ఇదే అని ప్రకటించింది. అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు విద్యాధ‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. మూడు క‌థ‌ల‌ను క‌లుపుతూ డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతో డైరెక్ట‌ర్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. ఈ సినిమాలోని హిమ‌లాయాల తాలూకు విజువ‌ల్స్‌, బీజీఎమ్‌, వీఎఫ్ఎక్స్ సీన్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోన్నాయి. నైజాం ఏరియాలోనే గామి మూవీ శుక్ర‌వారం మూడు కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. ఓవ‌ర్‌సీస్‌లో కోటి వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు చెబుతోన్నారు.

గామి సినిమాలో అఘోరాగా విశ్వ‌క్‌సేన్ యాక్టింగ్ బాగుందంటూ అభిమానులు చెబుతోన్నారు. ఈ సినిమాలో చాందిని చౌద‌రి, అభిన‌య, అబ్దుల్ స‌మ‌ద్ కీల‌క పాత్ర‌లు పోషించారు. పాజిటివ్ టాక్ కార‌ణంగా ఈ వీకెండ్‌లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

భీమా, గామితో పాటు మ‌ల‌యాళం డ‌బ్బింగ్ మూవీ ప్రేమ‌లు కూడా శుక్ర‌వారం తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ తెలుగులో రిలీజ్ చేసినా ఈ మూవీ మోస్తారు క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టింది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024