Actress Jayalalitha: నా కోసమే వైన్ బాటిల్ తెచ్చేవారు.. శరత్ బాబు నేను బిడ్డను కనాలనుకున్నాం: జయలలిత

Best Web Hosting Provider In India 2024

Actress Jayalalitha Sarath Babu: తెలుగులో అనేక సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు అలనాటి నటి జయలలిత. నాటి తరం సినిమాల్లో హీరోయిన్‍గా నటించిన జయలలిత తర్వాతి కాలంలో సైడ్ రోల్స్ చేశారు. ఎక్కువగా వ్యాంప్ పాత్రలతో ఆమె క్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవల బుల్లితెరపై సీరియల్స్‌లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. బంగారు గాజులు, ప్రేమ ఎంత మధురం వంటి తదితర సీరియల్స్ చేశారు జయలలిత.

 

ట్రెండింగ్ వార్తలు

అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో దివంగత నటుడు శరత్ బాబు (Sarath Babu), గుమ్మడితో (Gummadi) తనకు ఉన్న రిలేషన్ గురించి, అనుబంధం గురించి జయలలిత తెలిపారు. మీ జీవితంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో గుమ్మడి గారు ఒకరు. అసలు అంతలా లింకప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని జయలలితను యాంకర్ అడిగారు. దానికి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు జయలలిత.

“నా కోసం సులా అనే ఒక వైన్ బాటిల్ రోజు తెప్పించేవారు. రూ. 800 పెట్టి. ఇది నీకే. ఇది జయమ్మకే. వేరే ఎవరు ముట్టుకోవద్దు అని చెప్పేసి. ఒక నాలుగైదు సంవత్సరాలు కలిసి జర్నీ చేశాం. ఇప్పుడు అటు నుంచి వెళ్తే.. ఆ ఇల్లు చూస్తే మాత్రం నాకు ఏడుపు వస్తుంది. ఆయన పోయిన తర్వాత అక్కడ నిల్చుని ఉంటే పిల్లలందరిని పలకరిస్తూ నా భుజం తట్టి నాగేశ్వర రావు గారు ఓదార్చారు” అని జయలలిత చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

మొదటి పెళ్లి, బ్రేకప్ తర్వాత మళ్లీ ప్రేమ వైపు, కొత్త బంధం వైపు అడుగులు వేయలేదా అని అడిగిన ప్రశ్నకు.. “ఎందుకో ప్రేమ వైపు మనసు మళ్లలేదు. ఎవరి తోడు అవసరం లేదు అనిపించింది. చాలా మంది రెండో పెళ్లి చేసుకుంటాం, ఉంచుకుంటాం అంటూ వచ్చారు. కానీ, భగవంతుడు నన్ను అటువైపు వెళ్లనివ్వలేదు. అన్నపూర్ణమ్మ వీళ్లంతా కనీసం ఒక బిడ్డనైనా దత్తత తీసుకోండి అన్నారు. అక్క పిల్లలు ఉన్నారు కదా. చాలు అనుకున్నాను” అని జయలలిత తెలిపారు.

 

“శరత్ బాబుది నాది మనసు బంధమే. నేను బాగా అనుకున్నాను. కానీ, ఆయన కొంచెం అనుకుని వదిలేశాడు. ఆయన ఉన్నా చెప్పేదాన్ని. ఇప్పుడు లేరు కాబట్టి ఫ్రాంక్‌గా చెబుతున్నా. ఇది ఎవరికీ చెప్పలేదు. ఫస్ట్ టైమ్ చెబుతున్నా. చాలా మంచి వ్యక్తి. దేవుడు నాకు ఒక గైడ్‌ను పంపించాడు. మహానుభావుడు ఆయనతోనే కలిసి యాత్రలన్నీ చేశాను. ఒకరి రూపాయి తినరు. ఒకరికి పెట్టరు. ఆయన ఫ్యామిలీని చూసుకునేవాడు. కొంతమంది ఇండస్ట్రీ వాళ్లే పెళ్లి చేసుకుండా” ఆపారు అని జయలలిత అన్నారు.

“చాలా ప్లానింగ్ చేసుకున్నాం. బిడ్డను కూడా కనాలి అనుకున్నాం. దానికి సంబంధించి కూడా ప్లాన్ చేసుకున్నాం. కానీ, ఆయన చాలా ఆలోచిస్తారు. రేపు నువ్వు నేను చనిపోయాక ఆస్తి కోసం ఆ బిడ్డను ఏం చేస్తారో అనేవారు. నన్ను లలిత లలిత అని పిలుస్తుంటారు. వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒక తమ్ముడు నాతో క్లోజ్‌గా ఉంటారు. వాళ్ల అబ్బాయి కూడా నాతో టచ్‌లో ఉంటారు. ఒకవైపునే విని జడ్జ్ చేయలేం కదా. రమాప్రభ, ఆయన కలిసి ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియదు. నా విషయంలో మాత్రం ఆయన చాలా మంచి వ్యక్తి” అని జయలలిత వివరించారు.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024