Australia Telugu Doctor Died : ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలి మృతి, జలపాతం వద్ద ఫొటోలు తీస్తుండగా ప్రమాదం!

Best Web Hosting Provider In India 2024

Australia Telugu Doctor Died : ఆస్ట్రేలియాలో(Australia) లోయలో పడి తెలుగు వైద్యురాలు(Telugu Doctor) మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (23) మార్చి 2న ఆస్ట్రేలియాలోని గోల్డ్‌ కోస్ట్ హింటర్‌ ల్యాండ్‌లోని లామింగ్టన్ నేషనల్ పార్క్‌కు వెళ్లారు. అక్కడ యాన్‌ బాకూచి జలపాతం వద్ద ఫొటోలు తీస్తుండగా జారిపడి మరణించింది. ఉజ్వల గతేడాది గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్‌ చేశారు. జలపాతం వద్ద ఫొటోలు తీస్తున్న సమయంలో తన కెమెరా ట్రైపాడ్‌ను ఒక అంచుపై పడింది. దాన్ని తీసుకునే ప్రయత్నంలో కాలు జారీ లోయ పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె మృతి చెందింది. ఉజ్వల మృతదేహాన్ని వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది ఆరు గంటలకు పాటు శ్రమించారు.

ట్రెండింగ్ వార్తలు

ఊహించని ప్రమాదం

ఉజ్వల తల్లిదండ్రులు వేమూరు మైథిలి, వెంకటేశ్వరరావు… వీరు ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు. వైద్యురాలు కావాలనేది ఉజ్వల చిన్ననాటి కల అని తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం ఆమె రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుంది. పీజీ పూర్తి చేసి ఉన్నతస్థాయికి చేరుకోవాలనేది ఆమె లక్ష్యమని, కానీ ఇంతలో ఈ దుర్ఘటన జరిగిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. జీవితంలో ఉన్నత స్థితికి వెళుతుందనుకున్న కూతురు ఇలా ఊహించని విధంగా దూరమవడం ఉజ్వల కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఉజ్వల అంత్యక్రియల నిమిత్తం ఆమె భౌతిక కాయాన్ని కృష్ణా జిల్లా(Krishna District) ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ గారి ఇంటికి తరలిస్తున్నారు.

WhatsApp channel

టాపిక్

Krishna DistrictAndhra Pradesh NewsAccidentsTelugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024