Miss World 2024: మిస్ వరల్డ్ విజేతలుగా నిలిచిన భారతీయ అందగత్తెలు వీరే

Best Web Hosting Provider In India 2024

ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో 71వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకు భారత్ ఆతిథ్యమిస్తోంది.  మరికొన్ని గంటల్లో విజేత ఎవరో తేలిపోతుంది. 140కి పైగా దేశాల్లో వందకోట్లకు పైగా ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చూడటానికి  మార్చి 9న రాత్రి ఏడున్నర గంటలకు సోనీ లివ్ లో చూడండి.  అలాగే www.missworld.com వెబ్ సైట్లో చూడవచ్చు. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 టైటిల్ విజేత సిని శెట్టి ఈ ఈవెంట్లో భారతదేశం తరుపున పాల్గొంటోంది. ఆమె ప్రస్తుతం టాప్  20లో నిలుచుంది.

ట్రెండింగ్ వార్తలు

తమ తెలివితేటలతో, అందంతో ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ కిరీటాన్ని మన దేశానికి తీసుకొచ్చిన ఆరుగురు అందగత్తెలు ఉన్నారు.  ఇప్పుడు సినీ శెట్టి తన అందంతో మరోసారి మిస్ వరల్డ్ కిరీటాన్ని దేశానికి అందించాలని ప్రయత్నిస్తోంది.  ఇప్పటి వరకు మిస్ వరల్డ్ విజేతలుగా నిలిచిన అందగత్తెలు జాబితా ఇదిగో.

మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న భారతీయులు

1. రీటా ఫారియా పావెల్ (1966)

రీటా ఫారియా
రీటా ఫారియా (Instagram/@pageantandglamour)

ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా రీటా ఫరియా పావెల్ చరిత్ర సృష్టించింది. 1966లో ఆమె విజేతగా నిలిచింది. అప్పుడు ఆమె వైద్య విద్యార్థినిగా ఉంది. రీటా ఆ కాలంలోనే అందాల పోటీలపై ఉన్న అపోహలను చెరిపివేసి భారతీయ మహిళలు అంతర్జాతీయంగా అందాల పోటీల్లో పాల్గొనేందుకు మార్గం సుగమం చేశారు.

ఐశ్వర్య రాయ్ బచ్చన్ (1994)

ఐశ్వర్య రాయ్
ఐశ్వర్య రాయ్ (Twitter)

ఐశ్వర్యారాయ్ బచ్చన్ 1994లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. ఈమె 1973 నవంబరు 1 న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. ఈమె ఆర్కిటెక్చర్ చదివింది.  భారతదేశం నుండి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న రెండో మహిళ ఆమె. ఆ తరువాత బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించింది. 

3. డయానా హేడెన్ (1997)

డయానా హెడెన్
డయానా హెడెన్ (Pinterest)

భారత్ తరుపున 1997లో విజేతగా నిలిచిన అందగత్తె డయానా హేడెన్.  మూడోసారి మిస్ వరల్డ్ కిరీటాన్ని భారత్ కు అందించింది. ఈమె 1973 మే 1న హైదరాబాదులో జన్మించింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పట్టా పుచ్చుకున్న ఆమె మోడలింగ్ కెరీర్ ను ప్రారంభించి పలు ఈవెంట్లలో పాల్గొంది. 1997లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న డయానా తన తెలివితేటలు, ఆత్మవిశ్వాసం, మానవతా దృక్పథంతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది.

4. యుక్తా ముఖి (1999)

యుక్తా ముఖి
యుక్తా ముఖి (Pinterest)

1999లో యుక్తా ముఖి భారత్ నుంచి నాలుగోసారి మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. 1979 నవంబర్ 2న ముంబైలో జన్మించిన యుక్తా ముంబైలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హైస్కూల్లో చదువుకుంది. జువాలజీలో డిగ్రీ చేశారు. మిస్ వరల్డ్ గా గెలిచాక మహిళల హక్కులు, విద్య కోసం న్యాయవాదిగా మారింది.

5. ప్రియాంక చోప్రా జోనస్ (2000)

ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా (Pinterest)

ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. ఈ  గౌరవాన్ని గెలుచుకున్న ఐదో భారతీయ మహిళ ప్రియాంక చోప్రా. 1982 జూలై 18న జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ లో జన్మించింది ప్రియాంక. తండ్రి అశోక్ చోప్రా, తల్లి మధు చోప్రా. ఇద్దరూ భారత సైన్యంలో వైద్యులు. లక్నోలోని సెయింట్ లా మార్టినియర్ బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆమె, తరువాత జై హింద్ కళాశాలలో చదివింది.  2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని కిరీటాన్ని గెలుచుకుంది. ప్రియాంక ప్రపంచ సుందరిగా గెలిచాక బాలీవుడ్ ను ఏలింది. తరువాత  హాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడే సెటిలైపోయింది.

6. మానుషి చిల్లర్ (2017)

మానుషి చిల్లర్
మానుషి చిల్లర్ (Pinterest)

మానుషి చిల్లర్ 2017 లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె తల్లి డాక్టర్ నీలం చిల్లర్, తండ్రి డాక్టర్ మిత్రా బసు చిల్లర్. ఇద్దరూ వైద్యులే. ఆమె 1997, మే 14న హర్యానాలోని రోహ్‌తక్ లో జన్మించింది. న్యూఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆమె భాగర్ పోల్ సింగ్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం బాలీవుడ్లో రాణిస్తోంది.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024