Best Web Hosting Provider In India 2024
చాణక్యుడికి రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం మొదలైన అన్ని విషయాలలో లోతైన జ్ఞానం ఉంది. చాణక్యుడి ప్రతి సలహా అన్ని కాలాలకు సంబంధించినది. మీరు చాణక్యుడి సూత్రాన్ని అనుసరిస్తే జీవితం సంతోషంగా, విజయవంతమవుతుంది. చాణక్య నీతి జీవితానికి అవసరమైన అనేక బోధనలను అందిస్తుంది. చాణక్యుడు తన చాణక్య నీతిలో తల్లిదండ్రులకు కొన్ని సలహాలు ఇచ్చాడు. తల్లిదండ్రులు తమ పిల్లల ముందు కొన్ని పనులు చేయకూడదని చాణక్యుడు చెప్పాడు. తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఈ 5 పనులు చేయకూడదని చాణక్య నీతి చెబుతోంది. పిల్లల ముందు దాచాల్సిన విషయాలను చూద్దాం..
ట్రెండింగ్ వార్తలు
తప్పుడు మాటలు వద్దు
పిల్లలు దేవుడిలాంటి వారు. అలాగే పిల్లల మనసు మట్టి గోడ లాంటిది. పిల్లలను ఎంతో ప్రేమగా పెంచాలి. ఐదేళ్ల వరకు పిల్లలకు అన్నీ చాలా ప్రేమగా చెప్పాలి. పిల్లలు అమాయకులు, వారు ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ తప్పు చేయరు. వారి ముందు తప్పుడు మాటలు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే వారు వాటిని మైండ్‌లోకి తీసుకుంటారు. అటువంటి పరిస్థితిలో పిల్లలకు ప్రేమతో బోధించాలి. మీ పిల్లలు మీ నుండి నేర్చుకుంటారు. మీ పిల్లలు సంస్కారవంతులుగా, క్రమశిక్షణతో మెలగాలని మీరు కోరుకుంటే, వారి భాషను మెరుగుపరచడం మొదటి అడుగు. వారి ముందు ఎప్పుడూ చెడ్డ పదాలు ఉపయోగించవద్దు.
నిందించుకోవద్దు
పిల్లలకు ఐదేళ్ల వయసు వచ్చినప్పుడే వారికి కొంతవరకు విషయాలు అర్థమవుతాయని చాణక్యుడు చెప్పాడు. తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఒకరి తప్పులను మరొకరు విమర్శించుకోకుండా జాగ్రత్తపడాలి. పిల్లలు కూడా దీనితో బాధపడుతుంటారు. అలాగే, వారు మీలాగే అలవాట్లను అనుసరిస్తారు. మీరు ఒరినొకరు నిందించుకోవడం వారి ముందు చేయకూడదు.
గౌరవించుకోవాలి
చాణక్య నీతి ప్రకారం, తల్లిదండ్రులు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరినొకరు గౌరవంగా చూసుకోవాలి. ఈ విధంగా పిల్లలు ఒకరినొకరు గౌరవించడం నేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పిల్లల ముందు అసభ్య పదజాలం ఉపయోగించకూడదు. ఇది భవిష్యత్తులో, మీకు, మీ పిల్లలకు సమస్యలను కలిగిస్తుంది. తమ పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తమపై ఉందని తల్లిదండ్రులు గుర్తించాలి.
అబద్ధాలు చెప్పకూడదు
అబద్ధాలు ఎల్లప్పుడూ మనిషికి శత్రువు. చాణక్యుడు తన చాణక్య నీతిలో తల్లిదండ్రులకు కూడా అదే సలహా ఇచ్చాడు. తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు. అయితే దురదృష్టవశాత్తు, కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ స్వార్థపూరిత కారణాల కోసం తమ పిల్లలకు అబద్ధాలు చెబుతారు. ఇది కచ్చితంగా వారి భవిష్యత్తులో ఇబ్బందులను కలిగిస్తుంది.
ఇతరులను చెడు చేయెుద్దు
తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఇతరులకు చెడు చేయకూడదు. ఇలా చేయడం వల్ల పిల్లలకు చెడు అలవాట్లు ఏర్పడతాయి. ఇది వారిలో ప్రతికూల ఆలోచనలను సృష్టిస్తుంది. ఈ పరిస్థితి పిల్లలకు మంచిది కాదు. పిల్లలు ఇతరుల గురించి చెడుగా ఆలోచించేలా చేయకూడదని చాణక్య నీతి చెబుతుంది. చాణక్యుడి ప్రకారం జీవితంలో పిల్లలు విజయం సాధించాలంటే చిన్నప్పుడు వారికు ఉన్న అలవాట్ల సరిగా ఉండాలి. వారిని విజయం వైపు నడిపించేందుకు తల్లిదండ్రులు కష్టపడాలి.