VK Naresh: గోపీచంద్ భీమా శివరాత్రి సినిమా.. వీకే నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Gopichand Bhimaa Success Meet: మ్యాచో హీరో గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ భీమా. ఏ హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధా మోహన్ భారీగా నిర్మించారు. ఇందులో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్‌గా చేశారు. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన భీమా సినిమాకు దాదాపుగా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ భీమా సక్సెస్ ప్రెస్ మీట్‌ని నిర్వహించింది.

ట్రెండింగ్ వార్తలు

భీమా సక్సెస్ మీట్‌లో నటుడు డా. వికే నరేష్ మాట్లాడుతూ.. “చాలా మంది ప్రేక్షకులు భీమా చూసి ఇంటర్వెల్ ఎక్సలెంట్, క్లైమాక్స్ బ్లాక్ బస్టర్ అని మెసేజ్ పెట్టారు. ప్రతి సినిమాకి ఈ రెండు చాలా కీలకం. ఇందులో విజయం సాధించిన దర్శకుడు హర్షకి అభినందనలు. సంక్రాంతి సినిమాల శివరాత్రి సినిమా ఉంటుంది. భీమా శివరాత్రి సినిమా. థియేటర్స్ దద్దరిల్లాయి. రెండు పాత్రలు పండించడం చాలా కష్టం. గోపీచంద్ గారు చాలా అద్భుతంగా పండించారు. గోపీచంద్‌కి హ్యాట్సాఫ్” అని అన్నారు.

“రాధామోహన్ గారు చాలా రిచ్‌గా తీశారు. ప్రతిఒక్కరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేసే మాస్ సినిమా ఇది. సినిమాలో పని చేసిన పేరు పేరునా అందరికీ ధన్యవాదాలు” అని భీమా సక్సెస్‌ మీట్‌లో నటుడు వీకే నరేష్ తెలిపారు. “ఇంత మంచి ప్రాజెక్ట్‌ని నా వద్దకు తీసుకొచ్చిన మా సహా నిర్మాత శ్రీధర్ గారికి ధన్యవాదాలు. ఇంతమంచి ప్రాజెక్ట్‌ని చేసే అవకాశం ఇచ్చిన గోపీ గారికి, హర్ష గారికి ధన్యవాదాలు” అని భీమా ప్రొడ్యూసర్ కేకే రాధా మోహన్ అన్నారు.

“అజ్జు మంచి డైలాగ్స్ రాశాడు. ఆర్ట్ డైరెక్టర్ రమణ లంక సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. డీవోపీ స్వామీ అద్భతమైన విజువల్స్ ఇచ్చారు. ప్రేక్షకులు విజువల్స్‌ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నరేష్ గారి పాత్ర అందరినీ అలరిస్తుంది. రవి బస్రూర్ మ్యూజిక్ ఈ సినిమాకి బ్యాక్ బోన్‌గా నిలిచింది. గూస్ బంప్స్ మ్యూజిక్ ఇచ్చారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, వెంకట్ అద్భుతంగా యాక్షన్ డిజైన్ చేశారు. ఎడిటర్ తమ్మిరాజు గారు చాలా అద్భుతంగా ఎడిట్ చేశారు. మా ప్రొడక్షన్ టీం అందరికీ పేరుపేరునా థ్యాంక్స్” అని నిర్మాత రాధా మోహన్ తెలిపారు.

“గోపీచంద్ గారితో పంతం సినిమా తర్వాత మా అనుబంధం అలానే కొనసాగుతుంది. ఈ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించాం. సినిమా విజువల్స్ రిచ్ నెస్ తెరపై కనిపిస్తుంది. సినిమాకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పంధన వస్తోంది” అని చెప్పుకొచ్చారు భీమా నిర్మాత కేకే రాధా మోహన్. ఇదిలా ఉంటే భీమా సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. అలాగే సినిమాకు మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

భీమా సినిమాలో గోపీచంద్ యాక్షన్స్ అదిరిపోయాయని, మాస్ ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్ అని రివ్యూలు వచ్చాయి. ఇక గోపీచంద్ ఇందులో రెండు పాత్రల్లో కనువిందు చేశాడని అంటున్నారు. యాక్షన్ మూవీకి మైథలాజికల్ టచ్ ఇచ్చి భీమా తెరకెక్కించారని తెలుస్తోంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024