YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.22-12-2022(గురువారం) ..
విద్యార్థులకు ఈ- టాబ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
విద్య ద్వారానే సమాజాభివృద్ధి -దేశాభివృద్ధి : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన ఈ – ట్యాబ్ లను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు గురువారం అందజేశారు .. అనంతరం గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన మ్యాథ్స్ ఎగ్జిబిషన్ ను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రారంభించి, విద్యార్థులతో మాట్లాడారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను తన సొంత కుటుంబ సభ్యుల మాదిరి ఎంతో శ్రద్ధ తీసుకొని వారికి అవసరమైన అన్ని సమకూరుస్తూ, విద్యార్థుల పట్ల ప్రేమానురాగాలు కురిపించే జగన్ మామయ్యగా నిలిచారన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద రూ.55 వేల కోట్ల పైచిలుకు ఖర్చుపెట్టి నాడు -నేడు కార్యక్రమం ద్వారా పాడుబడిన ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాల కంటే ఉన్నతంగా తీర్చిదిద్దారని , అమ్మ ఒడి -గోరుముద్ద -జగనన్న విద్యా దీవెన- వసతి దీవెన లాంటి పథకాలు అమలు చేస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని తెలిపారు ,విద్యనభ్యసించిన విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా ఎదిగితేనే సమాజాభివృద్ధి జరుగుతుందని -తద్వారా రాష్ట్రం -దేశం అభివృద్ధి చెందుతాయని చెప్పారు , విద్యార్థుల భవిష్యత్తు మీద వైయస్ జగన్ ప్రభుత్వం -ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంత శ్రద్ధగా పని చేస్తున్నారో ,ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విద్యార్థుల నడవడికపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి మంచి -చెడులు నేర్పాలని , క్రమశిక్షణగా విద్యార్థులను పెంచితేనే వారి జీవితంలో బాధ్యతగా ఉన్నత స్థాయికి ఎదుగుతారని తెలిపారు ,సంక్షేమ పథకాల ద్వారా వైయస్ జగన్ ప్రభుత్వ నిధులను పప్పు-బెల్లల్లా పంచుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని , సంక్షేమ పథకాల అమలు -పనితీరుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రవ్యోల్బణం పై చేసిన ప్రకటన ప్రతిపక్షాలకు చెప్పుదెబ్బ లాంటిదని చెప్పారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరాం ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంబాబు నాయక్ ,ఎంఈఓ బాలాజీ నాయక్ ,ఎమ్మార్వో నరసింహారావు ,పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఓర్సు భవాని ,కౌన్సిల్ మరియు కో ఆప్షన్ సభ్యులు , విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ..